ఆంధ్ర ప్రదేశ్లో  5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు(హెల్త్‌ సబ్‌సెంటర్లు) ఏర్పాటు చేయాలని  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఈ ఆరోగ్య ఉపకేంద్రాలును మూడు దశల్లో నియమించాలి అని కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది.

 

ఇందుకు సంభందించి  తొలి విడత టెండర్లు అతి త్వరగా పిలిచి జనవరి 3 లేదా 4వ వారంలో పనులు మొదలు అయ్యేలాగా చూడాలని అధికారులకు సీఎం తెలియచేయడం జరిగింది. ఇక వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షా కూడా నిర్వహించడం కూడా జరిగింది.  ఈ ఉన్నతస్థాయి సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి  జవహర్‌ రెడ్డి తదితరులు పాల్కొనడం జరిగింది.  కొత్తగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు జనవరి 1 నుంచి జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంగా తెలియచేయడం జరిగింది.

 

ఇక వైద్య ఆరోగ్య రంగంపై మేనిఫెస్టోలో తెలిపిన హామీల్లో ఇంత వరకు అమలు చేయబడిన, ఇక నుంచి అమలు చేయాల్సిన వాటిపై సీఎంకు అధికారులకు పూర్తి వివరాలతో స్పష్టంగా తెలియచేశారు. ఇంకా  వైద్య, ఆరోగ్య శాఖలో ఇక నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి తేదీలు కూడా నిర్దారణ కూడా చేయడం జరిగింది.

 


సబ్‌ సెంటర్లు, ఆస్పత్రులు, కొత్త మెడికల్‌ కాలేజీలు, కొత్తగా నియమించాలని తలపెట్టిన కిడ్నీ, క్యాన్సర్‌ ఆస్పత్రులకు నిధుల సమీకరణ ఇలా అంశాలపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిండం జరిగింది.. రాబోయే సంవత్సరం ప్రారంభంలో  జనవరి 1 నుంచి కొత్త వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డుల జారీని మొదలు పెట్టాలి అని తెలియచేయడం జరిగింది. 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ, ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. ఇక ఆరోగ్యశ్రీతో  క్యాన్సర్‌ బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని సమావేశంలో సీఎం జగన్ స్పష్టంగా తెలియచేయడం జరిగింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: