ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశంపై పెద్ద చర్చ కొనసాగుంతున్న సంగతి అందరికి తెలిసిందే కదా. తాజాగా ఈ అంశంపై నిపుణులతో కూడిన జీఎన్ రావు కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది.ఈ కమిటీలో సీఎం జగన్ దాదాపు శాసనసభలో తెలిపిన విధంగానే, అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్టు, విశాఖలో కార్యనిర్వహక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలియచేయడం జరిగింది.
అంతే కాకుండా వేసవికాల అసెంబ్లీ సమావేశాలు విశాఖలోనే నిర్వహించాలని కూడా తెలియచేయడం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై పలువురు మేధావులు, నాయకులు స్పందించడం జరిగింది. ఈ అంశంపై తాజాగా లోక్‌సత్తా పార్టీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కూడా స్పందించడం జరిగింది.
జయప్రకాశ్ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనతో సూత్రప్రాయంగా ఆహ్వానించారు అంటే నమ్మండి. కానీ అమరావతిని ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా ఉండే మహా నగరంగా ఏర్పరచాలి అని జయప్రకాశ్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడైనా మహా నగరాలైన ప్రాంతాలే చాల త్వరగా అభివృద్ధి అవుతాయి అని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. గతంలో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత, అంతటి మహా నగరాన్ని నిర్మించుకోవడమే సరైందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో శాసనసభ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు లేదా దాని ధర్మాసనం ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించడం జరిగింది. వీటి అన్నిటి నిర్మాణానికి 2 వేల ఎకరాలు సరిపోతుందని తెలిపారు. అయితే, అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరో నగరంలో పెట్టడం మంచిది కాదు అని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇక అమరావతి, విశాఖపట్నాల్లో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేయడం బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.