నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు పుట్టినరోజు సందర్బంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి గృహంలో శనివారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు సందర్బంగా జగన్ తో ఉన్నత అధికారులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
ఈ వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు అజేయ కల్లాం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత మొదటి సారి జరుపుకుంటున్న పుట్టిన రోజు కావడంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు కూడా తెలియచేయడం జరిగింది.
ఇక మంత్రులు అదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, విశ్వరూప్, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు సీఎం వైఎస్ జగన్‌కు స్వయాంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అభిమానులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు అందరు కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రత్యేకంగా జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.ఇక ముఖ్యమంత్రి జగన్ తన పుట్టిన రోజు నాడు కొత్త పథకానికి కూడా మొదలు పెట్టడం గమనించ వలసిన విషయం. మన ఇండియా హెలార్డ్ గ్రూపు ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.