ఓ వ్యక్తికి పనికమలినా ఆలోచన వచ్చింది. అది ఏంటంటే తన భార్యను వేరొకరి వద్దకు పంపించి, వారి భార్యలను తాను అనుభవించాలనే పరమ నీచమైన ఆలోచన చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలో వ్యాపారం చేసే ఒక వ్యక్తికి (46) 2003 లో పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారికి. అతని భార్య(39) తో కొన్నేళ్లు అన్యోన్యంగా గడిపిన అతడు వేరొకరి భార్యలతో పక్క పంచుకోవాలనే నీచమైన ఆలోచన చేశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పి భార్యల్ని మార్చుకుందామని ఒప్పందం చేసుకున్నాడు ఈ ప్రబుద్దుడు.
అలా అనుకున్నదే తరువు ఓక రోజు తన భార్యను వేరొకరి దగ్గరకు పంపి, అతడి భార్యను తాను అనుభవించాడు. ఇలా రెండేళ్లుగా తన భార్యను వేరొకరి వద్దకు పంపి, వారి భార్యలను తన వద్దకు తెచ్చుకొని వారితో సరసాలు చేసేవాడు. ఆమెకి ఇష్టం లేకపోయినా కాపురం, పిల్లల భవిష్యత్తు కోసం ఈ నరకాన్ని అనుభవిస్తూ వచ్చిన భార్య చివరకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.
ఆమె తెలియ చేసిన వివరాల ప్రకారం.. మొదట 2017 జూన్ 15న నిందితుడు తన స్నేహితుడు, అతడి భార్యను కార్లో ఎక్కించుకొని తన భార్యతో కలిసి ఓ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడి భార్యను తనతో ఉంచుకొని, తన భార్యను స్నేహితుడి బెడ్‌రూంకు వెల్లమన్నాడు. దీనితో నిందితుడి స్నేహితుడు ఆమె పై బలవంతంగా అత్యాచారయత్నం చేయబోగా, వద్దంటూ ప్రాధేయపడటంతో చివరకు అతను వదిలిపెట్టాడు. ఆ తర్వాత 2017 అక్టోబర్ లో కూడా మరోసారి ఇలాంటి పనే చేశాడు ఆ వ్యక్తి.
ఈ సారి మరో కొత్త జంటతో నీచపు పనికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత ఓక రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన స్నేహితుడిని ఇంటికి పిలిపించి.. తన భార్యపై అత్యాచారం చేయించాడు. దీన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు ఆ నీచుడు. తన స్నేహితులతో పడుకోవాలని, లేకపోతే ఈ వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అలా పలు సందర్భాల్లో తన స్నేహితులకు ఆమెను ఎరగా వేసి, వాళ్ల భార్యలను తాను అనుభవించాడు.
చివరకు ఆ వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 23 వరకు పోలీసు కస్టడీకి అతడిని అప్పగించింది.