ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి రాజధాని నిర్మాణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపి ప్రలతో పాటు రాజధాని నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతుల మోహాల్లో మాత్రం తెలయని ఆందోళన కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి మొహంలో రాజధాని అమరావతిలో ఉంటుందా..? తరలిపోతుందా అనే ప్రశ్నార్ధకమే కనిపిస్తోంది. అందుకు ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టు పరిణమించాయి.


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అమరావతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన పెద్ద రగడ జరిగింది. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిపార్సు మేరకు... స్పీకర్ తమ్మినేని సీతారాం తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. అమరావతి రాజధాని భూముల పేరు క్రయ విక్రయాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెదేపా పాల్పడిందంటూ వైకాపా సభ్యులు ఆరోపించారు. దీనికి తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ ఎంతలా నచ్చజెప్పినా వారు శాంతించలేదు.


దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్న తెదేపా సభ్యులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌లను మంగళవారం ఒక్కరోజు మాత్రం సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేయడంతో, స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.


విశాఖ రాజధానిపై ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రకటించడం వల్ల ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి.. భీమిలి ఎమ్మెల్యే మంత్రి అవంతి శ్రీనివాస్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి నియోజకవర్గానికి రాజధాని రావడం నిజంగా సంతోషకరమని చెప్పారు. మంత్రి అవంతికి సంతోషకరం.. ప్రజలందరికీ సంతోషకరమన్నారు. భీమిలి పట్నం ఒక మహా పట్టణంగా వెలుగొందనుందని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. రాజధాని కోసం విశాఖలో భూముల సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: