ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. జగన్ మరో 20 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా రాష్టాన్ని పాలించేలా ప్రణాళిక రచిస్తున్నాడనే అభిప్రాయాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. అధికారంలొకి రాగానే సీఎం జగన్ గత ప్రభుత్వంలోని అవినీతిని వెలికితీస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు ప్రాంతాలలో అభివృద్ధి జరిగే విధంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రకటించారు. రేపు కేబినేట్ భేటీ తరువాత జగన్ అధికారికంగా మూడు రాజధానుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.  మరోవైపు జగన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ వైసీపీ పార్టీ తరపున చిరంజీవిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత చిరంజీవి జగన్ తో సఖ్యత గానే మెలుగుతున్నారు. సైరా సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తరువాత చిరంజీవి జగన్ ను సైరా సినిమా వీక్షించాలని కలిసి మరీ కోరిన విషయం తెలిసిందే. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి కూడా చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే వైసీపీకి సినీ రంగం అండగా ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా దెబ్బ తీసినట్లు అవుతుందని జగన్ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. 
 
చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే కాపు సామాజిక వర్గం కూడా వైసీపీకి అండగా ఉండే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ఇప్పటికే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశాడని చిరంజీవి ఇంకా తన నిర్ణయం చెప్పలేదని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే జనసేన పార్టీని కూడా నైతికంగా దెబ్బ తీసినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: