ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జగన్ మూడు రాజధానిలో ప్రకటనపై ప్రతి పక్షాలు విరుచుకుపడుతూ ఉంటే అటు అమరావతి రైతులు అందరు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. మూడు రాజధానిల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. ఇకపోతే నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత రాజదాని మార్పు నిర్ణయాన్ని మరికొన్ని రోజులకు వాయిదా వేసింది జగన్ సర్కార్ . అయితే రాజధాని నిర్ణయం వాయిదా పడడంతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటన చేసినప్పుడు నుండి ఒక రేంజ్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. ఇకపోతే తాజాగా మూడు రాజధానిల నిర్ణయం వాయిదా పడటంతో ఒక్కసారిగా అమరావతి రైతులందరూ భగ్గుమన్నారు. దీంతో రాజధాని ప్రాంతం అంతా అట్టుడుకుతోంది. రైతులతో పాటు రైతుల కుటుంబీకులు కూడా ధర్నాలు నిరసనలు తెలుపుతున్నారు. అయితే నేడు వెలగపూడి లో నిర్వహిస్తున్న రైతుదీక్ష ఉద్రిక్తంగా మారింది. అయితే రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వాహనాన్ని రాజధాని మహిళలు చుట్టుముట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. వాహనాన్ని ధ్వంసం చేస్తున్న మహిళలు ఇతర ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ సిఐ ఎస్ఐ గాయపడ్డారు. తాము చేసిన త్యాగాలకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డాడు రైతులు. పంటలు పండించుకునే భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేస్తే తమ త్యాగాలకు కనీస విలువ ఇవ్వకుండా రాజధానిని మార్చుతారా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో అంతా ఉద్రిక్తత నెలకొంది. అయితే రాజధాని నిర్ణయం వాయిదా పడడంతో ఈ నిరసనలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న నిరసనలు మరికొన్ని రోజుల్లో రైతుల నిరసనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని అందరూ చర్చించుకుంటున్నారు.