ఒక దేశం పెద్ద దేశం కావచ్చు లేదా చిన్న దేశం కావచ్చు కానీ దేశ రాజధాని మాత్రం జనాభాతో నిండిపోయి ఉంటుంది. ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు రాజధానిలో అందుబాటులో ఉంటాయి. కానీ ఒక దేశానికి చెందిన రాజధానిలో మాత్రం అసలు జనాలే లేకపోవటం గమనార్హం. ఆ దేశంలో గతంలో ఉన్న రాజధానిని అక్కడినుండి మార్చివేశారు. మూడు పంటలు పండే పొలాలను తీసుకొని కొత్త రాజధాని కోసం ఏకంగా 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 
 
ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయలను ఆ దేశ ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం విశాలమైన రోడ్లను ఏర్పాటు చేయగా షాపింగ్ మాల్స్. పెద్ద పెద్ద హోటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ ఏర్పాటయ్యాయి. కొత్త రాజధాని అయితే ఏర్పాటు అయింది కానీ ఆ రాజధానిలో నివశించడానికి జనాలు మాత్రం ఆసక్తి చూపట్లేదు. ఆ రాజధాని మరేదో కాదు నేపిడా. బర్మా దేశం యొక్క రాజధాని నేపిడా. 
 
నేపిడా రాజధానిని లండన్ కంటే విశాలమైన స్థలంలో నిర్మించారు. కానీ ఈ రాజధానిలో ఉన్న జనాభా మాత్రం కేవలం 9 లక్షలు కావటం గమనార్హం. నేపిడా లో రోడ్లు ఎప్పుడూ నిర్మానుష్యంగానే కనిపిస్తాయి. విదేశాల నుండి టూరిస్టులు కూడా నేపిడా కు రావడానికి ఆసక్తి చూపట్లేదు. బర్మా దేశానికి సైనిక పాలన తరువాత స్వాతంత్ర్యం వచ్చింది. మొదట బర్మా దేశానికి రంగూన్ రాజధానిగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొత్త రాజధానిని ఏర్పాటు చేశారు. 
 
నేపిడా ప్రాంతంలోకి ఎవరైనా వెళితే నేపిడా రాజధానేనా...? లేక దెయ్యాలు తిరిగే ప్రాంతానికి ఏమైనా వచ్చామా...? అనే అనుమానాలు కూడా వస్తాయి. దాదాపు 15 సంవత్సరాల క్రిందట 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేపిడా నగరాన్ని నిర్మించారు. జనాభా పెరిగితే భవిష్యత్తులో రాజధానిని కూడా విస్తరించాలని అక్కడి ప్రభుత్వం అనుకుంటున్నా నిర్మించిన రాజధానిలోనే జనాలు లేకపోవడంతో పాలకులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది ఈ రాజధానిలో జనాలు లేకపోవటంతో రాజధానిని ఘోస్ట్ క్యాపిటల్ అని పిలుచుకుంటూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: