ఏపీలో రాజధాని వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుండగానే జగన్ ప్రభుత్వం తాను చేయాల్సింది చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇటీవల అమరావతిలో అత్యవసరంగా భేటీ అయినా ఏపీ క్యాబినెట్ ఈ మేరకు రాజధాని వ్యవహారంపై ఏమి చేయాలనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకత తలెత్తకుండా మరోసారి రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సంద్రాభంగా హై పవర్ కమిటీని జగన్ నియమించారు.
ఏపీ సమగ్ర అభివృద్ధి, రాజధాని ఏర్పాటుపై నియమించిన కమిటీ నివేదికతో పాటు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను హై పవర్ కమిటీ అధ్యయనం చేయబోతోంది. హైపవర్ కమిటీ లో మొత్తం 10 మంది మంత్రులతో సహా 16 మంది సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్ర అభివృద్ధి, వికేంద్రీకరణ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మూడు వారాల్లోగా తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యవహరించబోతున్నారు.
మిగతా సభ్యుల వివరాలు :
ఆర్థిక ఇక శాసనసభ అ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్,
రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
,
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి,
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,
హోంమంత్రి మేకతోటి సుచరిత,
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,
మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ,
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని,
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని,
అలాగే ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లమ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, సిసిఎల్ చీఫ్ సెక్రెటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ, లా సెక్రటరీలు, సిఎస్ నీలం సాహ్ని హై పవర్ కమిటీ కన్వీనర్ గా వ్యవహరించబోతున్నారు