ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రైతుల  కుటుంబాలన్ని  రోడ్ల పైకి చేరి నిరసనలు ఆందోళనలు తెలుపుతున్నాయి. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము పంట పండించుకునే భూమిని తమ పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం త్యాగం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి నుంచి మారుస్తాను అంటున్నారు ఇలా చేస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు. ఇకపోతే జగన్ 3 రాజధానిల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు చిక్కులు వచ్చిపడ్డాయి. 

 

 

 జగన్ 3 రాజధానుల ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది లేదు. తాజాగా అమరావతి ప్రాంత ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో దోపిడీయే లక్ష్యంగా పని చేశారు అంటూ విమర్శించారు. అమరావతి రైతులందరికీ బూటకపు హామీ ఇచ్చి అవి నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేశారు అంటూ విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. 

 

 

 అలాంటి చంద్రబాబు ఈ రోజున రైతుల గురించి మాట్లాడడం దారుణమని విమర్శించారు. జిఎన్  రావు కమిటీ నివేదిక రాజధానిపై సీఎం ఆలోచన గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. కుటిల రాజకీయాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు అంటూ ధ్వజమెత్తారు. రాజధాని రైతుల కు చంద్రబాబు చేయని పనులు సీఎం జగన్ చేస్తున్నారని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బు ఇస్తోంది అని,  రైతు కూలీలకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: