ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నుంచి తరలించవద్దు  అమరావతి రైతులందరూ ఆందోళనలు నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు. అమరావతి రైతులే కాకుండా రైతు కుటుంబాల మొత్తం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.  దీంతో అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. మరోవైపు కర్నూల్ విశాఖ వాసులు ఆనందంలో మునిగిపోయారు ఎందుకంటే కర్నూలులో హైకోర్టు విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. 

 


 ఈ నేపథ్యంలో విశాఖ కర్నూలు వాసులు ఆనందంలో మునిగిపోయారు. విపక్ష పార్టీలు కూడా జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయం పై విరుచుకు పడుతున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధి చేయడం చేతకాక జగన్ సర్కార్ మూడు రాజధానిలు  అంటూ కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చింది అంటూ విపక్ష పార్టీలు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై అటు  దేశవ్యాప్తంగా కూడా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉంటే ఇంకొంతమంది జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రకటించిన రాజధాని నిర్ణయం పై సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అయింది. 

 

 మొదట ఎవరు ఈ పోస్ట్ చేశారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని పై నెట్టింట ఇప్పుడు ఈ జోక్ తెగ వైరల్ ఐపోతుంది. ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నది ఈ  సెటైర్.. పై విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. జగన్ ప్రకటించిన మూడు రాజధాని నిర్ణయం తర్వాత ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి అంటారా... "ఆంధ్ర పొడుగునా సముద్రం ఉంది కాబట్టి అసెంబ్లీ మరియు ప్రభుత్వ కార్యాలయాలు రెండు పెద్ద టైటానిక్ లాంటి షిఫ్ లలో పెట్టి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నెలకు ఒకసారి అటూ ఇటూ తిప్పితే... రాజధాని అందరి దగ్గర కు వచ్చినట్లు అవుతుంది కదా... అంతేకాకుండా ఒక ఫ్లోటింగ్ క్యాపిటల్ గా  ప్రపంచంలోనే ఏపీ రాజధాని కి గుర్తింపు వస్తుంది. ఇలా చేస్తే ఎవరు భూములు రియల్ ఎస్టేట్లు అవసరం లేదు" అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: