అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన రిలే దీక్షలు నేటితో 14వ రోజుకు చేరుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో పర్యటించారు. తొలుత మంగళగిరి మండలంలోని నవులూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన పవన్ ఆ తరువాత రైతులకు అభివాదం చేస్తూ ఎర్రబాలెంకు చేరుకున్నారు. పవన్ పర్యటనలో నాదెండ్ల మనోహర్ పలువురు పార్టీ నేతలు పాల్గొనగా మహిళా రైతులు పవన్ కు తమ సమస్యలను వివరించారు.
జగన్ మూడు రాజధానుల ప్రకటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని వ్యక్తులకు భూములు ఇవ్వలేదని పవన్ అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ కేసులు పెట్టి రైతులను జైల్లో వేయడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు కానీ జగన్ రెడ్డి కానీ రాజధానిని విశాఖలో పెడతామని కర్నూలులో హైకోర్టును పెడతామని చెప్పలేదన్న విషయం ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
కర్నూలులో హైకోర్టు పెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత ఉందా...? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిలో పర్యటించినపుడు రాజధాని మహిళలు పెట్టిన పెరుగన్నం తిన్నారు. పవన్ కళ్యాణ్ పెరుగన్నం తింటున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ పెరుగన్నం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.
పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలోని వివిధా గ్రామాల్లో పర్యటించనుండటంతో పవన్ కళ్యాణ్ ఈసారి కూడా పెరుగన్నం తింటారా...? అనే కామెంట్లు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి వినిపిస్తున్నాయి. వైసీపీ పార్టీ నేతలు పవన్ పెరుగన్నం తినటం గురించి గతంలో విమర్శలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ చెట్టు కింద పెరుగన్నం తినటానికే ప్రత్యేక హెలికాఫ్టర్ లో పర్యటన చేస్తున్నాడని సోషల్ మీడియాలో జోకులు పేలాయి. మరి పవన్ తాజా పర్యటనలో పెరుగన్నం తింటారో లేదో చూడాలి.