ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. చాలా చిన్న వయస్సులోనే ఎస్టీ కోటాలో పుష్ప శ్రీవాణికి మంత్రి పదవి దక్కింది. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పని చేసిన పుష్ప శ్రీవాణి భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి కురుపాం అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. 27 సంవత్సరాల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీవాణి 31 ఏళ్ల వయస్సుకే మంత్రి పదవి దక్కించుకున్నారు. 
 
సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవితో పాటు పుష్ప శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. పుష్ప శ్రీవాణి సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేటాయించిన శాఖలో దూసుకుపోతున్నారు. పుష్ప శ్రీవాణి సమాజంలో మార్పు కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుండి ఎవరైనా విమర్శలు చేస్తే పుష్ప శ్రీ వాణి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు. 
 
ఇప్పటివరకు యువతకు మాత్రమే ఎక్కువగా పరిమితమైన టిక్ టాక్ లో డిప్యూటీ సీఎం పాట పాడిన టిక్ టాక్ వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల ముందు సింగర్ మంగ్లీ "రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అన్న" అనే పాట పాడారు. ఆ పాటను డిప్యూటీ సీఎం లయబద్ధంగా పాడుతూ చేసిన టిక్ టాక్ వీడియో పాపులరై సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఎన్నికల ముందు ప్రాముఖ్యత పొందిన జగన్ పాటకు మంత్రి పుష్ప శ్రీవాణి అద్భుతమైన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చేసిన వీడియోపై నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పుష్ప శ్రీవాణి గతంలో ఒక చిన్న సినిమాలో కీలక పాత్రలో నటించారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత తెలిపే అమృత భూమి అనే సినిమాలో పుష్ప శ్రీవాణి నటించారు. ఈ సినిమాలో పుష్ప శ్రీవాణి టీచర్ పాత్రలో నటించారు. సీఎం జగన్ ను ప్రశంసించేలా ఉన్న పాటకు పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో చేయటంపై వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి టిక్ టాక్ వీడియోలో అదరగొట్టారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: