సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనీస అవగాహన లేకుండా పోస్ట్ చేస్తే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. సాధారణ వ్యక్తులకు ఏ సమస్య లేదు కానీ ప్రముఖులు ఒక పోస్ట్ పెడుతున్నారంటే అందులో ఏదైనా తప్పు దొరికితే క్షణాల్లోనే వైరల్ అవుతుంది. అప్పటిదాకా ప్రముఖులుగా ప్రశంసలు అందుకున్నవారు కూడా జోకర్ అయ్యే అవకాశం ఉంది. 
 
పాకిస్తాన్ కు చెందిన మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ కూడా ఇప్పుడు అలాంటి తప్పే చేసి దొరికిపోయాడు. నెటిజెన్లు రెహ్మాన్ మాలిక్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి చుక్కలు చూపిస్తున్నారు. రెహ్మాన్ మాలిక్ చేసిన పొరపాటు ఏమిటంటే మియా ఖలీపా అనే పోర్న్ స్టార్ ను భారతీయురాలిగా భావించారు. ఒక వ్యక్తి పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న భారతీయుల జాబితాను ట్విట్టర్ లో షేర్ చేశాడు. 
 
అయితే ఆ వ్యక్తి రూపొందించిన జాబితాలో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేరు కూడా ఉంది. ఆ విషయాన్ని మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ పెద్దగా పట్టించుకోలేదు. రెహ్మాన్ మాలిక్ తన ట్వీట్ లో మియా ఖలీఫాతో పాటు జాబితాలోని అందరూ చల్లగా ఉండాలని దీవించారు. మియాను దేవుడు దీవించు గాక అనే ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రెహ్మాన్ మాలిక్ ట్వీట్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ రెహ్మాన్ మాలిక్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. 
 
సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఒక ట్వీట్ లేదా పోస్ట్ చేస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని పోస్ చేయాలి. లేదంటే మాత్రం పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ లా నవ్వులపాలు కావాల్సి ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు ఎవరో వైరల్ చేస్తున్న విషయాలను పోస్ట్ చేయకుండా సమగ్ర అవగాహన ఉంటే మాత్రమే పోస్ట్ చేయటం మంచిది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: