రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి తెచ్చినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా అత్యాచార ఘటనలు మాత్రం తగ్గటం లేదు. మనుషులు వావీ వరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. అన్నీ తెలిసిన మనుషులే మానవత్వం, విచక్షణ మరిచి మృగంలా మారుతున్నారు. సమాజంలో మహిళలకు బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మృగాళ్ల ఆలోచనల్లో మార్పు రావటం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అన్న భార్యపై ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె మర్మాంగాన్ని కోసేశాడు. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం మునగపాడులో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మునగపాడు గ్రామానికి చెందిన మూడా బాలు అనే 40 సంవత్సరాల వ్యక్తి వరుసకు వదినయ్యే 45 సంవత్సరాల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆపై కత్తితో ఆమె మర్మాంగాన్ని కోసేశాడు. దీంతో మహిళకు తీవ్ర రక్తస్రావమైంది.
అప్పటికే స్పృహ కోల్పోయిన మహిళకు కొంత సమయం తరువాత స్పృహ వచ్చింది. వెంటనే 100కు డయల్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు బాధితురాలని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధితురాలికి చికిత్స అందించి ప్రాణాపాయం నుండి బాధిత మహిళను కాపాడారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడు బాలుని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. మానవత్వానికి మాయని మచ్చ తెస్తూ మదమెక్కిన మృగంలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పుడే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.