తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ నియమితులైన విషయం తెలిసిందే. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తమను కాదని సోమేష్ కుమార్ ను సీఎస్ గా నియమించడంపై కినుక వహించినట్టు సమాచారం. పలువురు స్పెషల్ సీఎస్ లు, ముఖ్య కార్యదర్శులు తమకు అన్ని అర్హతలు ఉన్నా తగిన అవకాశం ఇవ్వలేదని అలక వహించారని సమాచారం. 
 
ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ దగ్గర తమ కంటే చాలా జూనియర్ అయిన సోమేష్ కుమార్ కింద పని చేయలేమని చెప్పినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తుండగా కొందరు ఇండిపెండెంట్ గా పని చేసే పోస్టులకు బదిలీ చేయించుకోవాలని ఇంకొందరు మాత్రం సెలవుపై వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎస్ పదవి చేపట్టాలనే కల సాధారణంగా ప్రతి ఐఏఎస్ అధికారికి ఉంటుంది. 
 
ఆలిండియా సర్వీస్ అధికారులు ఆ పదవిలో కొన్నిరోజులైనా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సెక్రటేరియట్ వర్గాలు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులలో అలాంటి పదవి తమకు రాలేదని బాధ కనిపిస్తోందని చెబుతున్నాయి. మరోవైపు సీఎం పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన అజయ్ మిశ్రా జులై 31వ తేదీన రిటైర్ కానున్నారు. అజయ్ మిశ్రా డ్యూటీలో కొనసాగుతారా...? రిటైర్ అవుతారా...? అనే విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. 
 
1988 బ్యాచ్ శాలినీ మిశ్రా కూడా బదిలీపై లేదా సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా కూడా తనను బదిలీ చేయాలని కోరారని సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఇండిపెండెంట్ పోస్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్టు సమాచారం. సీఎస్ పదవి చేపట్టిన సోమేష్ కుమార్ కంటే దాదాపు 12 మంది సీనియర్లుగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: