దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనం అవ్వడంతో ఏదోరకంగా బలం పుంజుకుని మళ్లీ పునర్వవైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి ఏపీ తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకు రావడంతో పాటు అధికారం చేజిక్కించుకునే స్థాయిలో నాయకుల్లో ఉత్సాహం తీసుకురావాలని చూస్తోంది. దీనికి తగ్గట్టుగానే సమూల మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 12 రాష్ట్రాల్లో యువ నాయకులకు పార్టీ పగ్గాలను అప్పగించాలని కాంగ్రెసు అధిష్టానం చూస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు వల్ల పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం లేదనే ఒక అభిప్రాయానికి వచ్చేసిన అధిష్టానం యువ నాయకత్వం దిశగా అడుగులు వేస్తోంది.


 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికల్లో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాలు, ఢిల్లీ, గోవాలో నూతన అధ్యక్షులను నియమించే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డిని నియమించాలని చూస్తోంది. ఆయనైతేనే పార్టీకి పునర్వైభవం తీసుకు రాగలరని కాంగ్రెస్ నమ్ముతోంది. 


అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నా సమర్ధవంతంగా పార్టీని నడిపించే నాయకులు లేరనే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చూస్తోంది. అలాగే కర్ణాటకలో గుండూరావు ను తప్పించి ఆ బాధ్యతలను డీకే శివకుమార్ అప్పగించాలని చూస్తోంది. కేరళ తమిళనాడు ఇదే విధంగా నియామకాలు చేపట్టాలని చూస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం  చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు.


 మొన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం తప్పించకముందే తప్పుకోవాలని ఆలోచన లో ఉన్నారు. ఆయన బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ కి పునర్వైభవం తీసుకు రావాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: