ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు  యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జవహర్లాల్  నెహ్రు యూనివర్సిటీలో విద్యార్థుల పై గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా దాడి చేసి  గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాజకీయ ప్రమేయం ఉంది అంటూ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటనలో విద్యార్థి నాయకులు  సహా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా  మారింది. 

 

 

 అయితే తాజాగా ఢిల్లీ లో జవహర్  లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో విద్యార్థుల పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటనపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. నేడు మీడియాతో మాట్లాడిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విద్యార్థుల పై దాడిని ఒక ఆటవిక చర్యగా అభివర్ణించారు. విద్యార్థులపై దాడి చేసిన దుండగుల పై కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు సిపిఐ నేత నారాయణ. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య దేశంలో సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అసలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనిపిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు సిపిఐ నేత నారాయణ. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు. 

 

 

 హోంమంత్రి అమిత్ షా ది క్రిమినల్ ఇంటిలిజెన్స్ అంటూ వ్యాఖ్యానించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కుతాడని... మళ్ళీ  ఇక్కడికి వచ్చి... ఢిల్లీ పెద్దలపై విమర్శలు చేస్తూ మీసాలు తిప్పుతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు సిపిఐ నారాయణ. కార్మిక ఉద్యోగ కర్షక సంఘాల పిలుపు మేరకు  నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: