ఇరాన్ అమెరికాపై ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ బలగాలు క్షిపణులతో ఇరాక్ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగాయి. ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. 12 బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. అమెరికా తన బలగాలను పశ్చిమాసియా నుండి వెనక్కు తీసుకోవాలని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టం గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పెంటగాన్ ఎయిర్ బేస్ లపై జరిగిన దాడులను ఇప్పటికే ధ్రువీకరించింది. అమెరికా ఈ దాడిలో జరిగిన నష్టం గురించి అంచనా వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దాడులను ఖండించారు. అమెరికా రక్షణ శాఖ సరైన సమయంలో బదులిస్తామని తాజా పరిస్థితులపై ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారని ప్రకటన చేసింది. 
 
డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలను జారీ చేశారు. ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో "అంతా బాగుంది ! ఇరాక్ ఇరాన్ లో ఉన్న రెండు సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ చేసిన దాడుల వలన కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ అమెరికా దగ్గర ఉంది. రేపు ఉదయం నేను ఒక ప్రకటన చేస్తాను" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

ఇరాన్ మాత్రం క్షిపణులతో దాడి చేయటాన్ని సమర్థించుకుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జావేద్ జరీఫ్ మాట్లాడుతూ మాకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల గురించి మమ్మల్ని మేం కాపాడుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోమని స్పష్టం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: