టీడీపీ అధినేత చంద్రబాబుకు మీడియ సపోర్టు గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. అది జగమెరిగిన సత్యం. ప్రత్యేకించి రెండు దిన పత్రికలు ఆయనకు కొమ్ముకాస్తయన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్లిష్టమైన స్థితిలో ఉన్న సమయంలోనూ ఆయా పత్రికలకు తమ నాయకుడు చేసిందే గొప్ప.. తమ నాయకుడి వాదనే రైటు అనేలా ప్రవర్తిస్తున్నాయి.

 

తాజాగా రాజధాని మార్పు అంశం విషయానికి వస్తే.. దీర్ఘ కాలంలో రాష్ట్ర భవిష్యత్, యువత కు ఉద్యోగాలు, రాష్ట్రప్రగతి దృష్టిలో ఉంచుకుని విశాఖను రాజధానిని చేస్తామంటోంది జగన్ సర్కారు. అందుకు తన లాజిక్ తాను వినిపిస్తోంది. అమరావతిని హైదరాబాద్ స్థాయికి తీసుకురావాలంటే కనీసం లక్షన్నర కోట్ల రూపాయలు అవసరమని వాదిస్తోంది. అంత డబ్బు అమరావతిపై పెట్టడం కంటే.. విశాఖపై 10 వేల కోట్లు పెడితే హైదరాబాద్ స్థాయికి చేరుతుందని వాదిస్తోంది.

 

అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రోజుకో ఫుల్ పేజీతో ప్రత్యేక కథనాలు కుమ్మేస్తున్న అగ్రశ్రేణి పత్రిక ఈ లాజిక్ ను పట్టించుకోవడం లేదు. ఈ లాజిక్ మాకొద్దు. చంద్రబాబే ముద్దు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అమరావతిలో అన్నీ సమకూరాయి. ఇక అమరావతికి ఖర్చు చేయాల్సిందేమీ లేదని వాదిస్తోంది. మరి ఇదే పత్రిక ఎన్నికలకు ముందు అమరావతికి లక్షకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణిస్తూ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

 

అంటే ఏదేమైనా సరే.. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిందే కరెక్టు.. ఆయన వాదనను సపోర్టు చేసే విధంగా ఎలాంటి కథనాలైనా వండివారుస్తాం.. ఆయన వాదన బలపరచడం కోసం ప్రపంచం మొత్తం పరిశీలించి అనుకూల కథనాలు పత్రిక నిండా పరుస్తామని చెప్పకనే చెబుతోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ప్రపంచ దేశాల్లో కొత్తగా రాజధానులు కట్టుకున్న దేశాలు ఏవో.. వాటిని ఎందుకు కట్టుకున్నారో. అవి ఎలా అభివృద్ధి చెందాయో వివరిస్తూ తాజాగా మరో కథనం వండి వార్చేసింది అగ్రశ్రేణి పత్రిక.. ఏదేమైనా మాకు లాజిక్కులు వద్దు. చంద్రబాబే ముద్దు అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: