అవున్రా అబ్బాయ్ ఆ జగన్ ఏంట్రా మరీ మొండిగా తయారయిపోతున్నాడు. ఇంత మొండి మనిసిని నేనెక్కడా సూడలేదేహే ! ఇప్పుడు సీఎం అయిపోయాడు కదా హాయిగా ఏసీలో కూసిని ఆర్డర్లు మీద ఆర్డర్లు వేస్తూ  నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదరా ? ఎందుకురా ఏదో చెయ్యాలి ఏదేదో చెయ్యాలంటూ ఊరికే తాపత్రయపడిపోతున్నాడు ? ఆ పెద్దాయన చెప్పింది ఓపిగ్గా విన్న నాకు సిర్రెత్తుకొచ్చింది. ఆపు బాబాయ్ ఊరికే నసపెట్టేస్తున్నావ్ ? అతను మొండి వాడు అయితే నీకేంటి మెతకవాడు అయితే నీకేంటి ? నీ పించినీ నీకు వస్తుంది కదా కృష్ణ రామా అంటూ కూర్చోక నీకెందుకు ఈ రాజకీయాలు అంటూ చిరాకు పడ్డా  ! అయినా వదులుతాడా ఏంటి ? మళ్ళీ అదే నస.


ఇంటికెళ్లి పడుకున్నాక నాక్కూడా అదే గుర్తుకు వచ్చింది. అవును నిజమే ఈ జగన్ ఏంటి మొండి మా రాజు లా తయారయ్యాడు ? చంద్రబాబు లా ఈ ఐదేళ్ల పాటు ఇడ్లీ పాత్రి, రుబ్బురోలు, సెల్ ఫోన్ టవర్, ఇలా రకరకాల మోడల్ మోడల్ గ్రాఫిక్స్ చూపిస్తూ అదిగో రాజధాని ఇదిగో రాజధాని అంటూ హడావుడి చేయకుండా , ప్రజలను మోసం చేయకుండా అందరితోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు ? అయినా మొండి వాడు కదా తిట్టుకున్నా ఫర్వాలేదు అంటూ మొహమాటం లేకుండా అన్ని విషయాలను ప్రజల ముందు పెట్టేస్తున్నాడు. ఎంత మొండి వాడు కాకపోతే కేంద్రం నుంచి సహాయం రాకపోయినా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను సంతోషపెట్టాలని చూస్తున్నాడు ? 


అసలు జగన్ ఎంత మొండి వాడు కాకపోతే మండుటెండలు కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటాడు. అలా తెలుసుకున్నా వాటిని విని వదిలేయక అన్ని హామీలు నెరవేరుస్తున్నాడు. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడానికి జగన్ ఎంత ధైర్యం ? అయినా ఏ ప్రభుత్వం అయినా చివరి సంవత్సరంలో ఇటువంటి పనులు చేస్తుంది కానీ ఈ జగన్ ఏంట్రా బాబు ఇచ్చిన హామీలు  ఇవ్వని హామీలు అమలు చేస్తూ ప్రజలకు ఏదో చేసెయ్యాలనే తాపత్రయంతో మరీ మొండిగా తయారయ్యాడు అనుకున్నా.

 

నిజమే జగన్ మొండి వాడే మామూలు మొండి వాడు కాదు మొండి మా 'రాజు'. అవును జగన్ ఎవరి మాటా వినని మొండి మారాజు. తాను నమ్మింది చేసేది న్యాయం అని భావిస్తే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్లే మొండి. కాదు కాదు జగ మొండి. ఎవరు ఎన్నిరకాలుగా అనుకున్నా నాకు మాత్రం ఆ మొండి వాడంటేనే ఇష్టం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నా

మరింత సమాచారం తెలుసుకోండి: