ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను తీవ్రంగా కంగారు పెడుతున్నాయి. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబాయి నుండి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ ఈరోజు ఉదయం కటక్ సమీపంలో పట్టాలు తప్పింది. అధికారులు 6 బోగీలు నిర్గుండ దగ్గర పట్టాలు తప్పినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో రైలులో ప్రయాణిస్తున్న 50 మందికి పైగా గాయాలయ్యాయి.
కటక్ లోని ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. రైల్వే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే పోలీసులు ప్రథామికంగా పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. రైలు ప్రమాదం జరగటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రద్దీ సీజన్ కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. పొగమంచు కారణంగా గూడ్స్ రైలును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి జేపీ మిశ్రా ఈ ప్రమాదం గురించి స్పందించారు.
అగ్నిమాపక మరియు రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని జేపీ మిశ్రా తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రయాణికులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు ఏపీలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు నుండి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పట్టా విరిగినట్టు ట్రక్ మెన్లు గుర్తించి రైలును ఓబులవారి పల్లెలో నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్ మెన్లు స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇవ్వగా స్టేషన్ మాస్టర్ మరమ్మత్తులు చేయించారు. సకాలంలో గుర్తించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని సమాచార్న.