అవును తన సామర్ధ్యాన్ని నిరూపించుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నాలుగు నెలలే డెడ్ లైనుంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే బ్రహ్మాండమేదో బద్దలైపోతుందని బిజెపి నేతలు పవన్ తో పొత్తు పెట్టుకున్నారు.

 

మరి బ్రహ్మాండం బద్దలవుతుందా లేదా తెలియాలంటే  ఎలా ? ఎలాగంటే  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వచ్చే ఫలితాలే ఆధారం.  అందుకనే తమ రెండు పార్టీలు  కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పాల్గొంటాయని పదే పదే చెప్పారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 0.8 శాతం. జనసేనకు వచ్చింది 6 శాతం ఓట్లు. అంటే రెండింటికి కలిపి 7 శాతం ఓట్లు వచ్చాయని అనుకుంటే మళ్ళీ అదే ఓట్లు రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రావాలి.

 

రేపటి ఎన్నికల్లో  అన్నే ఓట్లు వచ్చినా లేకపోతే అంతకన్నా ఎక్కువచ్చినా అది తన ఘనతగానే పవన్ చెప్పుకునేందుకు అవకాశం ఉంది. అలా రాలేదంటే మాత్రం పవన్ తో పొత్తు వల్ల ఏమిటి లాభమని బిజెపి నేతలు ఆలోచించుకోవటం ఖాయం. ఒకసారి ఆ ఆలోచన వచ్చిందంటే బిజెపి ముందు పవన్ పలుచనైపోతారు. అప్పుడిక పొత్తులు కాదు విలీనం చేసేయక తప్పదు.

 

తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లో ఏకంగా విలీనమే చేసిన విషయం గుర్తుంది కదా ? విలీనం ముందు వరకూ చిరంజీవిని బ్రహ్మాండమన్నారు కాంగ్రెస్ నేతలు. ఒకసారి ఆ ముచ్చట పూర్తయిన తర్వాత సోనియాగాంధి అపాయిట్మెంట్ కూడా దక్కలేదు. కాకపోతే ఒప్పందం ప్రకారం కేంద్రమంత్రివర్గంలో చోటు వరకూ కల్పించారంతే.

 

కానీ ఇపుడు పవన్ పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉంది. పొత్తుల్లోనే జనసేన  ప్రభావం కనిపించకపోతే ఇక విలీనం చేసి మాత్రం ఏమిటి ఉపయోగమని బిజెపి నేతలు అడిగితే పవన్ ఏమని సమాధానం చెబుతారు ?  కాబట్టి పవన్ తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. చంద్రబాబునాయుడు దగ్గరంటే ఏదో ప్యాకేజీలు తీసుకుని కాలం గడిపేశారు. బిజెపిలో అలాంటి పప్పులుడకవు. ఎందుకంటే కమలం పార్టీలో ఉన్న వాళ్ళంతా పవన్ ను మించిన ముదుర్లే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: