హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఓయో రూమ్ కు వెళ్లి ఓయో రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే బోరబండ శివబస్తీకి చెందిన 22 సంవత్సరాల వయస్సు గల వరప్రసాద రావు ఒక హోటల్ కు మేనేజర్ గా హైటెక్ సిటీలో పని చేస్తున్నాడు. కొండాపూర్ లోని ఓయో హోటల్ రూమ్ కు నిన్న రాత్రి వరప్రసాద రావు అతని గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లాడు.
ఈరోజు తెల్లవారే సమయానికి వరప్రసాద రావు మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులకు ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది వరప్రసాద రావు మృతి గురించి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి వరప్రసాద రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఆ తరువాత వరప్రసాద రావు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
వరప్రసాద రావు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వరప్రసాద రావు గర్ల్ ఫ్రెండ్ ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు వరప్రసాద రావుది హత్యా...? ఆత్మహత్యా...? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
వరప్రసాదరావు గర్ల్ ఫ్రెండ్ చెప్పే సాక్ష్యమే ఈ కేసులో కీలకంగా మారింది. రాత్రి హోటల్ గదిలో యువతీ యువకుల మధ్య ఏం జరిగింది...? అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ తరువాత పూర్తి విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. పోస్టుమార్టం నివేదిక తరువాత వరప్రసాద రావుది హత్యా...? ఆత్మహత్యా...? అనే విషయం గురించి స్పష్టత రానుంది.