
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులను నిర్ణయించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించింది. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ప్రకటించింది. కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదం తర్వాత ఇక విశాఖ పట్నం ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని కానుంది.
ఇప్పుడు ఈ నిర్ణయంపై విశ్లేషణ మొదలైంది. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతో ఏపీ దూసుకుపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ పనుల విభజన, అభివృద్ధి విభజన అధికార విభజనతో ప్రగతికి అవకాశం పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది.
మూడు రాజధానులు నిర్ణయం ద్వారా అన్ని వ్యాపార, ఉద్యోగ వర్గాలకు మూడు సమ న్యాయం జరుగుతుంది. ఎక్కడికక్కడ సంస్థల ఏర్పాటు, కార్యాలయాల ఏర్పాటుతో ప్రజలకే కాకుండా ఉద్యోగులకు, వ్యాపారులకు మేలు జరుగుతుంది. రాయల సీమ ప్రాంతానికి న్యాయ రాజధానిని కేటాయించడం ద్వారా శ్రీభాగ్ ఒప్పంద స్ఫూర్తిని గౌరవించినట్టు అయ్యింది.
కేవలం మూడు రాజధానుల ఏర్పాటుతోనే కాకుండా రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు సరిగ్గా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా చేయడం ద్వారా అక్కడ 10 వేల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టి.. విశాఖను ఏపీ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ లా పని చేసే అవకాశం ఉంది. దీని కారణంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల జగన్ సర్కారు నెలకొల్పిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, స్కిల్ యూనివర్శిటీల ద్వారా ఏపీలో నిరుద్యోగాన్ని చాలా వరకూ తగ్గించే అవకాశం లభించింది.