
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని... ఒకే చోట అభివృద్ధి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందాలి అంటే మూడు రాజధానులు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల అంశాన్ని తెరమీదకు తెచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో అట్టుడికి పోతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తాయి. ఓవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ నిర్ణయంపై విపక్ష పార్టీలు అన్ని గగ్గోలు పెడుతుంటే... మరోవైపు అమరావతిలో తీవ్ర స్థాయిలో జగన్ నిర్ణయం పై రైతుల ఆందోళనలు ధర్నాలు కొనసాగుతున్నాయి.దీంతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది.
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అనుకున్నదే చేయాలని నిర్ణయించారు. మూడు రాజదానులను అమలు చేసేందుకు సిద్ధమైంది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయం తీసుకోవడానికి వెనుక అసలైన కారణం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి పోవడం. ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల పరిస్థితి మాత్రం మారక పోవడమే ఇందుకు కారణం.తమ ప్రభుత్వ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబాటుతనానికి గురైన ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని తెరమీదకు తెచ్చారు.
అమరావతిలో చట్టసభల రాజధాని కర్నూలులో న్యాయపరమైన రాజధాని విశాఖలో పరిపాలన రాజధానిని నిర్మించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. కాగా ఈ నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినది జగన్ సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వెనుకబాటుతనం పై మూడు రాజధాని లతో త్రిముఖ పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి వ్యూహం కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.