ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కమెడియన్లలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఆరేళ్ల క్రితం సైన్మా అనే లఘు చిత్రంతో ఫేమస్ అయిన రాహుల్ రామకృష్ణ డైలాగ్ రైటర్ మరియు నటుడిగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు పని చేశారు. అర్జున్ రెడ్డి సినిమాలోని పాత్ర రాహుల్ రామకృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ మరియు అతని యాస్ అతనికి ప్లస్ అయ్యాయి.
రాహుల్ రామకృష్ణ పెళ్లిచూపులు సినిమాతో రాహుల్ రామకృష్ణ జాతీయ పురస్కారం కూడా గెలుచుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాలో రాహుల్ రామకృష్ణ రెండు పాటలు కూడా రాయడం గమనార్హం. అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తరువాత రాహుల్ రామకృష్ణకు స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. భరత్ అనే నేను, గీతా గోవిందం సినిమాలతో మంచి గుర్తింపు పొందిన రాహుల్ రామకృష్ణకు హుషారు సినిమా కమెడియన్ గా మరో మెట్టు పైకి ఎక్కించింది.
సంక్రాంతి పండుగకు విడుదలైన అల వైకుంఠపురములో సినిమాలో కూడా రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమాలోని పాత్రకు రాహుల్ కు మంచి గుర్తింపు లభించింది. రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎవరికీ తెలియని సంచలన విషయాలను వెల్లడించారు. తన ట్విట్టర్ ఖాతాలో తనను చిన్నప్పుడు రేప్ చేశారని ఆ బాధను ఎప్పుడు ఎవరితో పంచుకోవాలో తనకు తెలీలేదని అన్నారు.
ఇతరులతో ఈ విషయాలను పంచుకోవడం ద్వారా మాత్రమే నేనేంటో తెలుసుకోగలుగుతున్నానని అన్నారు. అన్నీ బాధగానే ఉంటాయని రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ విషయం రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో చెప్పటంతో అతని అభిమానులు చాలామంది షాక్ కు గురయ్యారు. చాలామంది నెటిజన్లు రాహుల్ రామకృష్ణకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
I was raped during childhood.
— rahul Ramakrishna (@eyrahul) January 20, 2020
I don’t know what else to say about my grief, except for this, because this is what I seek to know about myself.