
అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు హస్తగతం చేసుకున్న తెలుగుదేశం నేతలు వివరాలను మంత్రి బుగ్గన అసెంబ్లీలో బయటపెట్టారు. మొత్తం జాబితా అంతా చదవి వివరంగా వినిపించారు. బినామీ ప్లాట్లు, రిజిస్ట్రేషన్లు చూస్తే..రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. అమరావతి కోసం మంచి హృదయంతో నిర్ణయం తీసుకుంటే స్వాగతించాలి. కానీ వీళ్లు వ్యాపార దక్పథంతో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన చెప్పారు.
బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. “ లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములు వదిలిపెట్టలేదు. అమాయకులైన ఎస్సీల భూములను కొనుగోలు చేశారు. సబ్ రిజిస్ట్రర్ ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయకపోతే తరువాత ల్యాండ్ పూలింగ్ చేసుకొని, బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. కొళ్లి శివరాం, గుమ్మడి సురేష్ వీరిద్దరు లోకేష్ బినామీలు. బులుసు శ్రీనివాసరావు, నిమ్మగడ్డ శాంతకుమారి, తదితరుల పేర్లతో 300 ఎకరాలు కొనుగోలు చేశారు.”
అంతేకాకుండా.. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లు లీజ్‌కు ఇచ్చారు. యూనివర్సిటీకి 200 ఎకరాలు ఇచ్చారు. ఎకరా రూ.50 లక్షల చొప్పున, అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, మరో యూనివర్సిటీకి 150 ఎకరాల చొప్పున ఇచ్చారు. మెడిసిటీ ఆఫ్ హెల్త్‌కు 150 ఎకరాలు ఇచ్చారు. ఆశ్చర్యంగా భూములు కట్టబెట్టారు. పబ్లిక్ సర్వీసెస్ 180 ఎకరాలు, 7 కేంద్ర సంస్థలకు 69 ఎకరాలు ఇచ్చారు. స్టార్ హోటళ్లకు కూడా భూములు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్లు, ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇచ్చారని మంత్రి బుగ్గన వివరించారు.
" దాదాపు 28 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు భూములు ఇస్తే..14 వేల మంది అమ్ముకున్నారు. ఇంత అన్యాయమైన పరిపాలన చేశారు. ఇంతటితో వదలకుండా భూములు అలాట్మెంట్ చేశారు. అమరావతి కన్వేషన్ సెంటర్లకు కూడా భూములు ఇచ్చారు. విచ్చలవిడిగా భూములు కేటాయించారు. భూములన్నీ టీడీపీ నేతలు స్వాహా చేశారన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .