ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి మామూలుగా దెబ్బ కొట్టటం లేదు. మూడు రాజధానుల ప్రతిపాదనపై జరుగుతున్న గోలకు అసెంబ్లీ వేదికగా మారిపోయింది.   ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలపై ఓటింగ్ అవసరమైతే ఎలాగూ అధికార వైసిపినే గెలుస్తుందనటంలో ఎవరికీ సందేహం లేదు.  అయితే ఇక్కడే చంద్రబాబుకు ఓ సమస్యలో ఇరుక్కుపోయారు. ఓటింగ్ జరిగితే ఓ రకమైన సమస్య జరగకపోతే మరో సమస్య. మొత్తానికి ఎలా చూసినా జగన్ దెబ్బకు చంద్రబాబు ఇరుక్కుపోయినట్లే.

 

అదేమిటంటే సఖ్యాబలం రీత్యా ఎలాగూ వైసిపినే గెలుస్తుందని చంద్రబాబుకూ తెలుసు. అయితే పార్టీలోనే తనకు ఎదురుతిరిగిన ఇద్దరు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ కతేంటో చూడాలని అనుకుంటున్నారట. అందుకనే అసెంబ్లీకి విధిగా హాజరవ్వాలని, ఓటింగ్ లో పాల్గొనాలంటూ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు విప్ జారి చేశారు.

 

జారీ చేసిన విప్ ప్రకారం గెలుపోటములతో సంబంధం లేకుండా  మొత్తం 23 ఓట్లు అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడాలి. పడకపోతే వంశీ, గిరి విప్ ను ఉల్లంఘించినట్లుగా భావించి వాళ్ళ సభ్యత్వాలను ఊడగొట్టాలని చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. అయితే ఇక్కడే చంద్రబాబు వ్యూహానికి జగన్ ఎదురు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే చంద్రబాబుకు ఎదురుతిరిగిన ఇద్దరు ఎంఎల్ఏలు అధికారపార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని అనుకుంటే వాళ్ళ సభ్యత్వాలు పోతాయి. మరి ఇప్పటికే జగన్ ప్రతిపాదనకు జై కొట్టిన విశాఖపట్నం నగరంలోని నలుగురు ఎంఎల్ఏల సంగతేంటి ?  ఓటింగ్ లో వాళ్ళు కూడా అధికారపార్టీకే అనుకూలంగా ఓట్లు వేస్తే  విప్ ఉల్లంఘించినందుకు మొత్తం ఆరుగురు ఎంఎల్ఏలపైనా అనర్హత వేటు పడుతుంది.

 

అంటే ఇక్కడే అసలు ట్విస్టుంది. అదేమిటంటే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న విషయం తెలిసిందే.  ఈ పదవికి ఎసరు రాకుండా ఉండాలంటే పార్టీకి కచ్చితంగా 18 మంది ఎంఎల్ఏలుండాలి. మరి ఆరుమంది మీద అనర్హత వేటు పడితే అప్పుడు టిడిపి బలం 17కి పడిపోతుంది.  అంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా గోవిందానే. విప్ ను ఉల్లంఘించిన ఎంఎల్ఏల మీద యాక్షన్ తీసుకుంటారో  లేకపోతే తన పదవిని కాపాడుకునేందుకు వాళ్ళని వదిలేస్తారో చూడాల్సిందే. మొత్తానికి జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబు బాగా ఇరకాటంలో పడిపోయారనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: