ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన తరువాత తెలుగుదేశం పార్టీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేసి ఆందోళనకు దిగటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరుతో సభ నుండి తమ్మినేని సీతారాం సభ నుండి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నానని స్పీకర్ కామెంట్లు చేశారు. 
 
తాను నిజంగానే మనస్థాపానికి గురవుతున్నానని స్పీకర్ వ్యాఖ్యలు చేశారు. పోడియం దగ్గరకు వచ్చి టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోడియం దగ్గర టీడీపీ సభ్యుల ప్రవర్తన హద్దు మీరడంతో స్పీకర్ తన మైక్ ను తీసివేసి వెళ్లిపోయారు. స్పీకర్ సభ నుండి వెళ్లిపోవడంతో సభ కొనసాగుతుందా...? లేక వాయిదా పడుతుందా...? తెలియాల్సి ఉంది. 
 
మాట్లాడటానికి తాను అవకాశాలు ఇస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ సభ్యులు పదే పదే పోడియం దగ్గరకు రావడం ఏమిటని స్పీకర్ కామెంట్లు చేశారు. సభకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని స్పీకర్ కోరినా టీడీపీ నేతల తీరు మారకపోవడంతో సభ నుండి స్పీకర్ వెళ్లిపోయారు. స్పీకర్ వెళ్లిపోవడంతో ఇటు అసెంబ్లీ అటు మండలి రెండూ కూడా వాయిదా పడ్డాయని తెలుస్తోంది. 
 
స్పీకర్ వెళ్లిపోవడంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ పదే పదే పోడియం దగ్గరకు వచ్చి నినాదాలు చేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు కూడా అడ్డు తగిలారు. ఏపీ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో సభ్యులు షాక్ అయ్యారు. టీడీపీ సభ్యులు అమరావతిపై చర్చకు పట్టుబట్టటం, జై అమరావతి అంటూ నినాదాలు చేయడంతో స్పీకర్ హెడ్ ఫోన్స్ టేబుల్ పై పడేసి వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: