
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ఎస్ కు టీఆర్ఎస్ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ పెద్దలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు తలనొప్పిగా మారుతున్నాయి. రెబల్స్ ఎక్కడా తగ్గకపోవడంతో జిల్లా అగ్రనేతలు సైతం తలపట్టుకుంటున్నారు.
కొత్తగూడెం పురపాలకంలో టీఆర్ ఎస్ కు రెబల్స్ బెడద తప్పలేదు. స్వతంత్రంగా బరిలో ఉన్న 41 మందిలో మెజారిటీ వ్యక్తులు టీఆర్ఎస్ లోని ఓ వర్గం బలపరిచిన వారు కావడం విశేషం. స్థానికంగా కాంగ్రెస్, టీడీపీ , సీపీఎం, సీపీఐ కొన్నిచోట్ల కూటమిగా ఏర్పడ్డాయి. ఇంకొన్ని చోట్ల కూటమి కుదరని చోట్ల స్నేహ పూర్వక పోటీకి సిద్ధమవుతున్నాయి.
కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్రావూ అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. టికెట్లు దక్కకపోవడంతో పలవువురు టీఆర్ఎస్ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఆయన పాతుకుపోకుండా చేసేందుకు సొంత పార్టీకే చెందిన కొందరు పాతకాపులు వనమాకు బ్రేకులు వేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకుతోనే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. టీఆర్ఎస్ లో చేరిన వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్‌కు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌తో విభేదాలున్నాయి. అయితే ఇక్కడ కాస్త బెటర్. ఆయన వర్గానికీ టికెట్లు ఇచ్చి జాగ్రత్త పడ్డారు. మరో వైపు.. మధిరలో టీఆర్ఎస్ రెబల్స్ రంగంలో ఉన్నారు. ఇక్కడ విపక్ష కూటమిలోకి party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ వచ్చి చేరడం గులాబీ నేతలు కాస్త మింగుడపడని రాజకీయమే.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇల్లెందు మునిసిపల్ రాజకీయం మరీ దారుణంగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కంటే.. సొంత పార్టీ నుంచే ముప్పు కనిపిస్తోంది. ఇక ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ వర్గీయులకే టికెట్లు దక్కాయి. దీంతో మాజీ మునిసిపల్ చైర్మన్ మడత రమ వర్గీయులు రెబల్స్‌గా బరిలో నిలిచారు. అందుకే మిగిలిన పార్టీ సంగతి పక్కకు పెట్టి ఇక్కడ సొంత పార్టీలోనే టీఆర్ఎస్ కుమ్ములాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.