రకుల్ ప్రీత్ సింగ్... ఓ వైపు తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తునే... మరోవైపు  తన హాట్ హాట్ అందాలతో అందరికీ చెమటలు పట్టిస్తుంది ఈ అమ్మడు  టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ అమ్మడుకి  ప్రస్తుతం మాత్రం అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. టాలీవుడ్ లో అవకాశాలు తక్కువని పోయాయి. ఇక అటు బాలీవుడ్ లో కూడా తన లక్ ను పరీక్షించుకుంటోంది ఈ అమ్మడు. ఏకంగా స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తు  బాలీవుడ్లో కూడా తమ సత్తా చాటుతోంది. ఇకపోతే గత కొంతకాలంగా ఎక్కడ తెరమీద కనిపించడం లేదు ఈ ముద్దుగుమ్మ. సినిమా అవకాశాలు లేక పోతే... ఏంటి వ్యాపారంతో కూడా బిజీ బిజీ గానే ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. 

 

 ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన ఈ అమ్మడు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది . ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో సీనియర్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకు అందరితో నటించను అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.ఇక  ప్రతి ఒక్కరూ ప్రేమకు సంబంధించిన ప్రశ్నలు తనను  అడుగుతున్నారు అని... ప్రేమ గురించి చెప్పాలంటే ప్రేమ ఎంతో అందమైనది అంతకన్నా లోతైనది అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం.. అందుకే తాను ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు అంటూ తెలిపింది. ఇప్పటివరకు ఎవరిని ప్రేమించకపోయినప్పటికీ ప్రేమ గురించి మాత్రం తనకు చాలా బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.తాను  నటించిన చిత్రాలు  అన్నింటిలో ప్రేమ కోసం హీరోల వెనక పడుతూ అన్ని విధాలుగా ప్రేమను తాను టచ్ చేస్తూ ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. 

 

 సినిమాల్లో హీరోల వెనక పడుతూ హీరోలను లవ్ చేస్తూ ఉంటే ప్రేమలో తనకు అనుభవం వస్తుంది అంటూ తెలిపింది . ఒక్కో చిత్రంలో ఒక్కో రకమైన లవ్ స్టోరీ తనకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది  అంటూ చెప్పుకొచ్చింది. ఒక పాత్రలో లీనమై నటించడం ఒక కొత్త జీవితం అనుభవాన్ని ఇస్తుంది అంటూ రకుల్ చెబుతోంది. అలాంటి సినీ ప్రయాణంలో ఎన్నో జీవితాలను అనుభవిస్తున్నాను అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది . అందుకే తనకు ప్రేమలో ఎంతో అనుభవం ఉందని కానీ ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: