ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరై వైయస్ జగన్మోహన్ రెడ్డి... 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి  చేపట్టిన తర్వాత ప్రతి శుక్రవారం  సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో తనకు ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని... అంతేకాకుండా తన ప్రోటోకాల్ కోసం  ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని ప్రతివారం సిబిఐ కోర్టులో విచారణకు హాజరు పై తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై  విచారణజరిపిన  సీబీఐ ప్రత్యేక కోర్టు... జగన్ కు వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటూ ఆరోపణలు రావడంతో పిటిషన్ను కొట్టివేసింది

 

 

 ఈ నేపథ్యంలో గత రెండు వారాల కిందట సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఒకసారి జగన్ వ్యక్తిగత మినహాయింపు కోసం వేసిన పిటిషన్ కొట్టివేసినప్పటికీ  మరోసారి సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగత మినహాయింపు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. కాగా దీనిపై విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది.

 

 

 ప్రతివారం ఈడీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ రోజు విచారణ జరిగపింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.  ఈడీ కేసులో  కేసులో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: