ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ కంపల్‌సరీ అయిపోయింది. ప్రస్తుతం అది నిత్యవసరాల్లో ఒకటైంది. జనరేషన్‌తో పని లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్‌ఫోనే. ఇంట్లో నలుగురు కూర్చున్నా అందరూ ఫోన్లే చూస్తున్నారు. ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం లేదు. అలాగే ఏదైనా ఫంక్షన్లకు కలిసినా సెల్‌ఫోన్‌లో మొహాలు పెట్టి ఎవరి దారిన వాళ్ళు ఆర్టిఫిషియల్‌గా మాట్లాడుకుంటూ ఆనాటి ప్రేమాభిమానాలు ఏమయ్యాయా అనేటట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే... సెల్‌ఫోన్ మరీ ఎక్కువగా వాడినా ఎన్నో రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
సెల్‌ఫోన్ వాడకం వలన మెదడు, చెవి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందనీ, కొన్ని సార్లు అది కేన్సర్ కి కూడా దారి తీయవచ్చన్నది చాలామంది ఎప్పటి నుంచో చెబుతున్న మాట! ఇప్పటి వరకూ మాటలకే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు పరిశోధనలతో నిజమైంది. సెల్ఫోన్లను రోజులో ఎక్కువ సేపు ఉపయోగిస్తే శరీరంలో ఏ భాగానికైనా కేన్సర్ వచ్చే అవకాశముందన్న విషయం కరోలినా యూనివర్సిటీ వారి పరిశోధనల్లో స్పష్టమైంది. కొన్ని ఎలుకల మీద వీరు కొన్ని నెలల పాటు నిర్వహించారు.
కొన్ని తలగాయపడిన నెలల అనంతరం ఎలుకల ఆరోగ్యాన్ని పరిశీలించగా ' ఆడ ఎలుకలకన్నా, మగ ఎలుకల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడాన్ని వీరు గుర్తించారు. అంతే కాక కొన్ని మగ ఎలుకల్లో కేన్సర్ ఫిట్స్ లక్షణాలు గమనించారు. తక్కువ ఆడ ఎలుకల్లో ఈ ప్రభావం తక్కువగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. సెల్‌ఫోన్లు ఉపయోగించే వారిలో స్త్రీల కన్నా పురుషులే ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. కాబట్టి సెల్‌ఫోన్‌ను అవసరమైనంత మేరకే వాడుకోండి. రాత్రిళ్లు పడకకి దూరంగా స్విచ్చాఫ్ చేసి పెట్టుకోండి. అతిగా సెల్ ఫోన్ వాడితే కాన్సరే! అలాగే సెల్‌ఫోన్‌ని వైబ్రేషన్‌లో పెట్టి కొంత మంది మగవారు కింద ప్యాంట్ జేబులో పెడుతుంటారు. అది అత్యధికమైన ప్రమాదం అలా పెట్టడం వలన తొడ దగ్గర ఉండే నరాలు బలహీనతతో తర్వాత కొన్ని సెక్స్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.