తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అతి త్వరలో షాకింగ్ న్యూస్ చెప్పనుంది.. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు గడచిన మూడేళ్ల నుండి వరుసగా నష్టాలు వస్తున్నాయి. అందువలన ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీల పెంపుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసరాలకు అనుగుణంగా టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మండలికి సమర్పించనున్నాయి. 
 
గతేడాదే ఏ.ఆర్.ఆర్. సమర్పించాల్సి ఉన్నా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ఈ పనులు ఇంతకాలం పెండింగ్ లో ఉండగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఏ.ఆర్.ఆర్ ను సమర్పించనున్నాయి. ప్రస్తుతం పరిశ్రమల అవసరాల కొరకు, ఇళ్లకు విద్యుత్ ను పంపిణీ చేస్తున్న డిస్కంలు యూనిట్ కు 32 పైసల చొప్పున నష్టపోతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి కొనుగోలు చేసిన కరెంట్ అప్పులు కూడా దాదాపు 14,000 కోట్ల రూపాయలకు చేరాయి. 
 
అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో డిస్కంల ఆర్థిక లోటు 11,000 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రజల డిమాండ్ కు తగిన విధంగా డిస్కంలు కరెంట్ ను కొంటూ సరఫరా చేస్తూ ఉండటంతో డిస్కంల లోటు పెరుగుతూ ఉండగా అదే సమయంలో ప్రభుత్వ సబ్సిడీలు కూడా పెరుగుతూ ఉండటంతో ఆ భారం కూడా డిస్కంల పైనే పడుతూ ఉండటం గమనార్హం. 
 
గతంలోనే డిస్కంలు విద్యుత్ ఛార్జీల పెంపుకు అనుమతి ఇచ్చి లోటును భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం విద్యుత్తు సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లింపులు జరపలేదు. సబ్సిడీలు పెంచే అవకాశం ఇప్పట్లో లేకపొవడం, యూనిట్ కు 32 పైసల వరకూ నష్టాలు వస్తూ ఉండటంతో విద్యుత్ ఛార్జీల సవరణ తప్పనిసరిగా మారడం గమనార్హం. సవరణల పెంపుకు ప్రభుత్వం మొగ్గు చూపుతూ ఉండటంతో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: