రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయనే విషయం తెలిసిందే. కాసేపట్లో పార్లమెట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు కూడా హాజరు కానున్నారు. కేంద్రం పార్లమెంటరీ పక్ష నేతలను బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కోరనుంది.               
 
ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. పూర్తి వివరాలలోకి వెళితే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో రేపు కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలు ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు తోడ్పడాలని కేంద్రం కోరనుంది. 
 
కేంద్రం ఏ అంశంపైనైనా చర్చించటానికి సిద్ధంగా ఉందని కేంద్రం చెప్పే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సీఏఏకు సంబంధించిన ఆందోళనలు ఇప్పటికే జరుగుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలు కూడా సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ, రాజ్యసభ వేదికగా నిలదీయాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
సీఏఏపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అంశాలను లేవనెత్తే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సీఏఏపై చర్చకు ఎంతవరకు అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని వేగంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కూడా వైసీపీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ మాత్రం విపక్షాలను ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: