లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు కారణంగానే విద్యార్థులకు రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్నారు విసి ప్రసాద్ రెడ్డి. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు నారా లోకేష్ మద్దతు తెలపడంపై విసి ఆగ్రహం వ్యక్తం చేసారు. క్యాంపస్ లో ప్రస్తుతానికి నడుస్తున్న ఆందోళన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందన్నారు. 

 

విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదన్న ఆయన . విద్యార్థులను రెచ్చగొట్టి ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఏయూ నిధులను భారీగా దుర్వినియోగం చేశారన్నారు. బ్లాక్ గ్రాంట్స్ ఇవ్వకుండా ఏయూ ఇంటర్నల్ గ్రాంట్స్ ను కూడా అడ్డగోలుగా వాడుకున్నారన్నారు. అలా తండ్రి కొడుకులు కలిసి వరుస తప్పు మీద తప్పులు చేయడంతో.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు..పచ్చ కెందలలకు చాలా మంది దాసోహం అంటున్నారు.. అందుకే ఎన్నో అరాచకాలు ఈ భూమి మీద జరిగాయని వైసీపీ నేతలు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు.. ఇప్పుడు కూడా అబ్బా కొడుకులు చట్టం చుట్టం గా వ్యహరిస్తున్నారు...విద్యా వ్యవస్థను తమ సొంతపనుల కోసం వాడుతున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నారు.. అలా టీడీపీ గతం చేసిన పొత్తనలన్ని ఇప్పుడు వారి మెడకే చుట్టుకున్నాయి అందుకే ఘోర ఓటమిని చవి చూశారు అంటూ ధ్వజమెత్తారు..

 

 

ఆంధ్రా యూనివర్శిటీ నిధుల నుంచి వందకోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో మళ్లించి పసుపు కుంకుమకు కేటాయించారని విసి ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.ఏయూ నిధులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు ప్రసాద్ రెడ్డి.  జ్ఞానభేరి కోసం రూ. 4 కోట్ల రూపాయలను దారి మళ్లించారని అన్నారు. 

 

 

అదేవిధంగా మెస్ చార్జీలు, ఫీజుల పెంపుపై తీసుకున్న నిర్ణయం తనది కాదని .గత వీసీ తీసుకున్ననిర్ణయమని వీసీ అన్నారు.  విద్యార్థులతో చర్చించి సమస్యలు పరిష్కారిస్తామని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు విద్యార్థుల భవిషత్ తో ఆడుకుంటుంటే సహించేదిలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: