వైసీపీ పార్టీలో చెప్పుకోదగ్గ ఫైర్‌బ్రాండ్లు ఎవరన్నా వున్నారంటే వారు చెవిరెడ్డి, రోజాలు. అయితే వారికి మంత్రి ప‌ద‌వులు ల‌భించే అవ‌కాశం ఉందా? అనేదే ఈ చ‌ర్చల ప్రధాన కాన్సెప్ట్‌. రెండేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రిగినా.. టాప్ టెన్ మంత్రుల్లో ఇదే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు. సో.. మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌రిగిన‌ప్పటికీ ఈయ‌న‌ను మార్చేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌రు. సో దీంతో రోజా, చెవిరెడ్డిల‌కు ఆశాభంగ‌మేన‌ని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పోనీ ఒక‌వేళ మార్చినా ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఆ ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అంటున్నారు. 

 

అయితే,  వీరిలో చెవిరెడ్డికే ఎక్కువ మెజారిటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. పైగా ఈ ఇద్దరికీ కూడా కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల‌నే జ‌గ‌న్ అప్పగించ‌డం విశేషం. సో.. దీంతో ఈ ఇద్దరి విష‌యం చిత్తూరులో పలు చర్చలకు దారితీసింది. అప్పట్లో జగన్ కేబినెట్ కూర్పులో తమకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని పలువురు నేతలు భావించారు. దీనికి తోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంత మంది నేతలకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో వారితో పాటు వారి అనుచరులు మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. చివరికి ఆశించిన పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవ్వడం, వారికి జగన్ సావధాన పరచడం అందరికి తెలిసినదే.

 

జగన్ కేబినెట్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో.. వైఎస్సార్‌సీపీ ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు అందరి నోళ్లలో ప్రముఖంగా నానింది. పార్టీలో మొదటి నుంచి తన గళాన్ని బలంగా వినిపించిన అంబటి రాంబాబుకు కూడా మంత్రి పదవి దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ, వీరిద్దరికీ నిరాశే దక్కింది. ఇక సీనియర్ నేత, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో కీలకమైన ఆర్థిక శాఖకు మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం అపుడు చర్చనీయాంశంగా మారింది. 

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అయితే.. ఆయనకు ప్రభుత్వ విప్‌ పదవితో పాటు తుడా ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి సమున్నత గౌరవం కల్పించడంతో అయన చల్లబడ్డారు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుత మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పిన వైఎస్ జగన్.. వీరందరికీ న్యాయం చేస్తారేమో వేచి చూడాలి!!

మరింత సమాచారం తెలుసుకోండి: