ఒక్కసారి ఆ మాయదారి యాప్ ను ఓపెన్ చేసారు అంటే ఇక క్లోజ్ చేయడం మీ తరంకాదు... ఇక ఒక్కసారి ఆ యాప్ నుంచి ఎంటర్టైన్మెంట్ పొందడం స్టార్ట్ చేసారు అంటే దానికి ఎడిట్ అయిపోవాల్సిందే... అది ఎంతో మంది ప్రాణాలను బలిగొంది... ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టింది... ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది... ఇంతకీ ఆ యాప్ ఏమిటి అనుకుంటున్నారా ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం ఊపేస్తున్న... టిక్ టాక్. ఇప్పటికే టిక్ టాక్ ఎఫెక్టుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెట్టింది ఈ టిక్ టాక్. ఇప్పుడు ఇద్దరు దంపతులను విడదీసింది. భార్య టిక్‌టాక్‌లో అసభ్యంగా వీడియోలు చేస్తుందని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. టిక్ టాక్ కావాలా నేను కావాలా తేల్చుకో అని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు... కానీ భార్య మాత్రం అతి సులువుగా నువ్వేం వద్దు నాకు టిక్ టాక్ కావాలి అంటూ తేల్చి చెప్పేసింది. దీంతో భర్త షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టిక్ టాక్ ఇద్దరు దంపతుల మధ్య చిచ్చు పెట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టిక్ టాక్ లో ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు పెరగడంతో ఆమె సెలబ్రిటీల ఫీలైపోతుంది. దీంతో కట్టుకున్న భర్తనే దూరం పెట్టేసింది. బెంగళూర్ లో నివసించే వాళ్ళిద్దరికీ 2008 సంవత్సరంలో పెళ్లయింది. 2014 సంవత్సరంలో వారికి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత భర్తకు జాబ్ రావడంతో సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. ఇక పక్కింటి ఆమె రిక్వెస్ట్ తో టిక్ టాక్ లోకి ప్రవేశించింది సదరు భార్య. ఇక తరచు టిక్ టాక్ లో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. దీంతో ప్రతి రోజు ఎక్కువగా లైకులు షేర్లు కామెంట్లు వస్తుండడంతో డానికి ఎడిక్ట్ అయిపోయింది. ఇక తక్కువ సమయంలోనే ఆ మహిళకు లక్షల్లో పాలోవర్లు కూడా పెరిగి పోయారు.
ఈ క్రమంలోనే తన భార్య టిక్ టాక్ చేసిన వీడియో ని భర్తకు తన స్నేహితుడు చూపించడంతో భర్త ఖంగు తిన్నాడు. ఆ వీడియోలో భార్య అసభ్యంగా డాన్సు చేస్తుంటే కామెంట్లు కూడా మరింత అసభ్యంగా రావడంతో కోపంతో ఊగిపోయిన భర్త ఫోన్ చేసి భార్యను మందలించాడు. వీడియో కాల్ భార్యతో గొడవపడగా... నేనేమీ అసభ్యంగా డాన్స్ చేయడం లేదు... మీ ఫ్రెండ్ తప్పుగా నా వీడియోలను చూపించాడు అంటూ భర్తకు ఎదురుతిరిగి మాట్లాడింది భార్య. ఇక అనుమానం వచ్చిన భర్త మంచి జాబ్ వదిలేసి ఇండియా కు వచ్చేశాడు. ఇక ఇంటికి వచ్చి భార్య చేసిన టిక్ టాక్ వీడియోలు చూడగానే అనుమానిస్తున్నారు అంటూ భార్య బోరున ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత భర్త పోలీసుల దగ్గరకు వెళ్ళగా పోలీసులు ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు పంపించారు. అక్కడ భర్త టిక్ టాక్ వదిలేయాలి అని చెప్పినప్పటికీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. లక్షలాది మంది ఫాలోవర్లు నిరాశపరిచలేనని తెలిపింది. అయితే ఈ దంపతులిద్దరి మధ్య రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్పుకొచ్చారు.