జరుగుతున్న ప్రచారం ప్రకారం ఐటి అధికారుల కళ్ళే చెదిరిపోతున్నాయట. చంద్రబాబునాయుడు దగ్గర శ్రీనివాస్ ఐదేళ్ళు పిఎస్ గా పనిచేశాడు. అంతుకుముందు ఐదేళ్ళు పిఏగా పనిచేశాడు. అంటే మొత్తం చంద్రబాబు దగ్గరే పదేళ్ళు పనిచేశాడు. ఈ లెక్కన శ్రీనివాస్ ఏ స్ధాయిలో అధికారాలు చెలాయించుంటాడు ? ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబుకు కళ్ళు, చెవులు శ్రీనవాసే అనే ప్రచారం అందరికీ తెలిసిందే.  చంద్రబాబును ఎవరు కలుసుకోవాలన్నా ముందుగా ఈయనగారిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనట.

 

అలాంటి శ్రీనివాస్ పై హఠాత్తుగా ఢిల్లీ నుండి వచ్చిన ఐటి అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో వాకింగ్ కు బయలుదేరుతున్న సమయంలో బయట డోర్ బెల్ మోగిందట. ఎవరొచ్చారో చూద్దామాని శ్రీనివాస్ తలుపు తెరిచినపుడు ఎవరో  ఇద్దరు హిందిలో  శ్రీనివాస్ గురించి అడిగారట. ఈ ఇల్లు తనదే అని తానే శ్రీనివాస్ అని చెప్పటంతో వాళ్ళు తామెవరమో చెప్పారట. దాంతో వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులుగా అర్ధమైంది. వాకింగ్ కు బయలుదేరుతున్నానని ఏమైనా ఉంటే బయటే మాట్లాడుకుందామని అన్న శ్రీనవాస్ ను వాళ్ళిద్దరూ అడ్డుకున్నారట.

 

వాకింగ్ కు వెళ్ళేందుకు లేదని చెప్పిన కొద్దిసేపటికే మరో పెద్ద బృందం నేరుగా శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చేశారట. దాంతో వాళ్ళంతా ఢిల్లీ నుండి వచ్చిన ఐటి బృందమని అర్ధమైపోయింది. వాళ్ళకు తోడుగా వచ్చిన పోలీసులు కూడా ఢిల్లీ నుండి వచ్చిన సిఆర్పిఎస్ అధికారులట. ఇక అప్పటి నుండి సోదాలు మొదలయ్యాయి.

 

ఇంట్లో ఉన్న బీరువాలు, సేఫులు, రహస్య లాకర్లు, బెడ్ కమ్ డ్రాయర్స్ ఇలా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారుల కళ్ళు చెరిరిపోతున్నాయట. ఎందుకంటే ఇప్పటి వరకూ బయటపడిన ఆస్తుల ప్రకారం హైదరాబాద్, విజయవాడలోని చాలా ఫ్లాట్ల డాక్యుమెంట్లు బయటపడ్డాయట. అమరావతి పరిధిలోని గ్రామాల్లో భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా దొరికాయట.

 

ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు, బినామీ వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయట. పిఎస్ దగ్గరే వందల కోట్ల ఆస్తులుంటే ఇక ఇద్దరు సారుగార్ల ఆస్తులు ఎంతుంటాయో అనే చర్చ జరుగుతోంది. చూద్దాం ఎటువంటి సంచనాలు బయటపడతాయో ?

మరింత సమాచారం తెలుసుకోండి: