ఏపీ సీఎం జగన్ కు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టులో పోలవరం నిర్మాణ ప్రాజెక్టు పనులను ఆపివేయాలని ఒడిశా ప్రభుత్వం అఫిడవిట్ ను దాఖలు చేసింది. మొత్తం 71 పేజీల అఫిడవిట్ ను ఒడిశా ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. ఒడిశా పోలవరం ప్రాజెక్టు దగ్గర గరిష్ట వరద ప్రవాహం ఆంధ్రప్రదేశ్ చెప్పిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని అఫిడవిట్ లో పేర్కొంది. 
 
సుప్రీంకోర్టును ఒడిశా ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేయాలని కోరింది. ఒడిశా ప్రభుత్వం గోదావరి వరద ప్రవాహం ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ఇచ్చిన విధంగా కాకుండా 14 లక్షల క్యూసెక్కుల వరకు అధికంగా ఉందని పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం రూర్కీ ఐఐటీ సర్వే లెక్కల ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 
 
పోలవరం డ్యాం అంత వరద ప్రవాహాన్ని తట్టుకోలేదని 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వస్తే ఒడిశా రాష్ట్రంలోని సీలేరు, శబరి ప్రాంతాలలో 200 అడుగులకు పైగా ముంపు తలెత్తే అవకాశం ఉందని తేలింది. 2015 సంవత్సరంతో పోలిస్తే 2017 సంవత్సరానికి ముంపు గ్రామాల సంఖ్య తగ్గిందని ముంపు గ్రామాల విషయంలో కూడా స్పష్టత లేదని ఒడిశా ఆరోపణలు చేసింది. 
 
గరిష్ట వరదను లెక్కించడానికి బ్యాక్ వాటర్ స్టడీ చేయించాలని పూడిక వల్ల భవిష్యత్తులో బ్యాక్ వాటర్ తో నష్టం పెరుగుతుందని నష్ట నివారణ కొరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరింది. సీఎం చెప్పిన పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్న సమయంలో ఒడిశా దాఖలు చేసిన అఫిడవిట్ జగన్ కు షాక్ అనే చెప్పాలి. సుప్రీం ధర్మాసనం ఈ అఫిడవిట్ విషయంలో ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: