ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడిన కేంద్ర అధికార పార్టీ బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాక్ ఇస్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల లో దూసుకుపోతుంది. క్రేజివాల్ పార్టీ ని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలా అయినా ఈ సారి ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీని మట్టికరిపించి బీజేపీ జెండా రెపరెపలాడించేందుకు గట్టిగానే ప్రయత్నించింది. క్రేజీ వాల్ కు వ్యతిరేకంగా బిజెపి అన్ని రకాల మార్గాలను వాడుకుంది. ఆయన హవా తగ్గించేందుకు ప్రయత్నించింది.
కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమ హవాకు ఎక్కడా తిరుగులేకుండా చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేసింది. అయితే క్రేజీ వాల్ నిజాయితీపరుడు అనే సానుభూతి ప్రజల్లో ఉండడం, దానికి తగినట్టుగానే ఆయన రాజకీయ పారదర్శక ప్రదర్శిస్తూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ కనిపించారు. ఎక్కడ అవినీతి అనేది లేకుండా చూసుకుంటూ ప్రజలకు ఏది అవసరమో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్లారు. ప్రజల్లో కూడా క్రేజీవాల్ మంచివాడని సమర్థుడని రాజకీయంగా ప్రజలకు చిత్తశుద్ధితో పరిపాలన అందించగలరనే నమ్మకంతో ఆయన వైపే ఎక్కువ మొగ్గు చూపారు.
బిజెపి క్రేజీ వాల్ మీద ఆయన ప్రభుత్వం మీద బురద చల్లేందుకు ఎందుకు ప్రయత్నించినా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే శివసేన కాంగ్రెస్ వంటి పార్టీలు క్రేజీ వాల్ కు అండగా నిలబడ్డారు. సోషల్ మీడియాలో సైతం ఆయనకు మద్దతుగా ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో ఒకే ఒక్క నిజాయితీపరులు క్రేజీవాల్ అటువంటి వారిని కూడా బిజెపి చంపేస్తుందా అంటూ శివసేన తృణమూల్ కాంగ్రెస్ కు గట్టిగానే బిజెపికి కౌంటర్ ఇచ్చి ప్రచారం చేశాయి. ప్రజల్లో కూడా ఇదే భావన వ్యక్తం కావడంతో క్రేజీ వాల్ కు బాగా కలిసి వచ్చింది.
ప్రస్తుతం కౌంటింగ్ ఫలితాలు చూస్తే ప్రజల్లో క్రేజీవాల్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన నిజాయితీ, సమర్ధతను ప్రజలు గుర్తించారనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను చూసి బిజెపి ఆందోళనకు గురవుతోంది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రేజీ వాల్ క్రేజ్ ముందు నిలబడలేకపోయామనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది.