ప్రేమికుల రోజు సందర్బంగా ఈరోజు ఎక్కడ చుసిన కూడా ఎర్రని గులాబీలు, భారీ గా ఉన్న బహుమతులు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు జంటలు అక్కడ కనిపిస్తే అక్కడే తాలి కట్టించాలని పార్కులలో, పబ్లిక్ ప్రదేశాలలో కాచుకు కూర్చున్నారు. ఇకపోతే ఈరోజు సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్నా పెద్ద సినిమాలతో కలుపుకొని పది సినిమాల నుండి అప్డేట్స్ బయటకు వచ్చాయి. 

 

విషయానికొస్తే.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతీరోజు పండగే సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం ' సోలో బ్రతుకే సో బెటర్ ' .. సుబ్బు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కానున్నాడు.వైజాగ్ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం నుండి తాజాగా ఒక వీడియో థీమ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో తేజు మాట్లాడిన మాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. 

 

ఈ వీడియోలో  తేజు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. అలాగే, ‘ప్రేమ’ అనేది కూడా ఒక ఫీలింగేగా, మారదని గ్యారంటీ ఏంటి?. సోలో బ్రతుకే సో బెటర్ ?’ అంటూ సాయితేజ్ అనడం కనబడుతుంది. అప్పుడే యువత అన్నీ రంగాల్లో ముందుకు వెళుతుందని  అన్నారు. 

 


ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రెండో షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. అన్నీ కార్యక్రమాలను త్వరలోనే పూర్తిచేసుకొని, కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకొని మే 1న విడుదల థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా ఎలా ఉండొతుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: