తెలుగుదేశంపార్టీ నేతలు ఎక్కడా అడ్రస్ కూడా కనబడటం లేదు. ప్రత్యర్ధులకు సంబంధించిన ఏ విషయంలో అయినా  రెచ్చిపోయి మీడియాలో ఊదరగొట్టే పచ్చనేతలు గురువారం రాత్రి నుండి మీడియాకు ఎక్కడా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారా ? అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. ఎందుకింతగా భయపడిపోతున్నారంటే ఐటి అధికారులు అధికారికంగా రిలీజ్ చేసిన ఓ ప్రెస్ నోటే కారణం.

 

చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో  ఐదు రోజులు జరిపిన సోదాల్లో ప్రాధమికంగా దాదాపు రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలను గుర్తించినట్లు చెప్పారు. ప్రెస్ రిలీజ్ లో  ఇంకా చాలా విషయాలను  ఐటి అధికారులు వివరించారు. ఎప్పుడైతే  ప్రెస్ రిలీజ్ మీడియాలో ప్రత్యక్షమైందో అప్పటి నుండే  అంటే సుమారు గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతం నుండి టిడిపి నేతలు ఎక్కడికక్కడ హైడ్ అవుట్లలోకి వెళ్ళిపోయారు.

 

వాళ్ళ రియాక్షన్ కోసం మీడియా ఎంతగా ప్రయత్నించినా ఏ  ఒక్క నేత కూడా దొరకలేదంటేనే వాళ్ళు ఎంతగా వణికిపోయారో అర్ధమైపోతోంది.  వైసిపి నేతలకు సంబంధించిన చిన్న విషయంలో కూడా మాజీ మంత్రులు  దేవినేని ఉమ, జవహర్, నక్కా ఆనందబాబు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మాజీ ఎంఎల్ఏలు బోండా ఉమ తదితరులు రెచ్చిపోవటం అందరూ చూస్తున్నదే. అధికార ప్రతినిధులు పంచుమర్తి అనూరాధ, పట్టాభి లాంటి వాళ్ళు కూడా ఎక్కడా అడ్రస్ కనబడలేదు.

 

ఇదే విషయం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆరోపణలు వచ్చినపుడు పై నేతలంతా ఏ స్ధాయిలో రెచ్చిపోయి మీడియాలో ఎంత యాగీ చేసింది అందరూ చూసిందే. మరి అదే పరిస్ధితి తమ అధినేత చంద్రబాబునాయుడుకు ఇబ్బందిగా మారినపుడు మాత్రం ఒక్కళంటే ఒక్కళు కూడా  ఎక్కడా మాట్లాడటం లేదు. ట్విట్టర్లో చెలరేగిపోతున్న చంద్రబాబు, పుత్రరత్నం నారా లోకేష్ కూడా  మూగబోయినట్లే కనిపిస్తోంది. మరి ఎన్నాళ్ళు మీడియాలో కనిపించకుడా దూరంగా తప్పించుకుని తిరుగుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: