తాజాగా యనమల రామకృష్ణుడు మాట్లాడిన మాటలతో అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై జరిగిన ఐటి దాడులు జరిగింది. ఐదు రోజుల పాటు జరిపిన సోదాల్లో సుమారు 2 వేల కోట్ల రాపాయల బ్లాక్ మనీ లావాదేవీలు పట్టుబడ్డాయని అధికారికంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో అందరి దృష్టి గురువారం రాత్రి నుండి చంద్రబాబునాయుడు మీదకు మళ్ళింది. దానికి తోడు వైసిపి నేతలు, బిజెపి నేతలు కూడా చంద్రబాబును ఆరోపణలతో వాయించేస్తున్నారు.
దాంతో మీడియాకు, అధికారపార్టీ, బిజెపి నేతలను ఎదుర్కొనేందుకు యనమల రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడిన మాటలు చూసిన తర్వాత పాపం ఆయనపైన కూడా ఐటి దాడులు పెద్ద షాక్ కొట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఎందుకంటే దాడులు, ప్రెస్ రిలీజ్ పై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.
ఇంతకీ యనమల ఏమంటారంటే అసలు శ్రీనివాస్ కు చంద్రబాబు, పార్టీకి ఏమీ సంబంధం లేదట. అదే సమయంలో ఐటి దాడులు జరిగిన మూడు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలు కూడా వైసిపి నేతలవేనట. హైదరాబాద్ లో జరిగిన దాడి లోకేష్ బినామి కిలారు రాజేష్ దనే ప్రచారం అందరికీ తెలిసిందే. కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి కంపెనీల మీద కూడా దాడులు చేసినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. అంటే దాడులు జరిగిన మూడు కంపెనీలూ టిడిపి వాళ్ళవే అన్న విషయం ప్రపంచానికంతా తెలుసు.
అన్నిటికన్నా విచిత్రమేమిటంటే మూడో పేరాలో చెప్పిన మాజీ పిఎస్ శ్రీనివాస్ వ్యవహారానికి రెండో పేరాలో చెప్పిన అంశాలకు సంబంధమే లేదని యనమల తన అతి తెలివంతా చూపిస్తున్నారు. మొత్తం ప్రెసె రిలీజ్ ను పేరాలు పేరాలుగా విడదీసి జనాలను కన్ఫ్యూజ్ చేద్దామని యనమల నానా అవస్తలు పడుతున్నారు. మొత్తానికి తమ అధినేత చంద్రబాబు ఐటి దాడుల్లో తగులుకోవటం ఖాయమని తేలిపోవటంతో యనమల షాక్ కు గురైనట్లే ఉంది. అందుకనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.