ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లి షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కార్ కి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరం నుండి విజయవాడ సిటీకి ప్రయాణిస్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం అంటేనే చాలా భయంకరమైన సంఘటన. కానీ అదృష్టవశాత్తు బ్రదర్ అనిల్ కుమార్ కారుకు ప్రమాదం జరిగినప్పటికీ అతను కేవలం చిన్న గాయాలతో బయటపడగలిగారు. ఈ కారులో ఉన్న డ్రైవర్ తో సహా అతని గన్ మేన్ కి కూడా గాయాలయ్యాయి.
ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఆపై బ్రదర్ అనిల్ కుమార్ పరిస్థితి తెలుసుకున్నారు. స్వల్ప గాయాలు అయ్యాయని తెలియడంతో వారిని వెంటనే ఒక ఆసుపత్రికి తరలించి చికిత్సని అందించారు. చికిత్స పొందిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వేరొక కారులో తన గన్ మెన్ తో సహా విజయవాడకి బయలుదేరారు.
4 రోజుల క్రితం కూడా నీటి పారుదల శాఖ మంత్రి అయిన జగన్ బావ అనిల్ కుమార్ విజయవాడకు వెళ్లారు. ఉన్నత ఉద్యోగులతో, ఉద్యోగ సంఘాల నాయకులతో కలసి తమ శాఖ రూపొందించిన 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పుకొచ్చారు. 3000 లస్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జగన్ పాలనలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం జలంతో కళకళలాడుతుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తొందరగా తమ తెలంగాణ నిర్వహించి ప్రజల సంక్షేమం కొరకై ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అలా ఉంటే మంచి పేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరిగేషన్ ఉద్యోగులే అసలైన నాయకులని వారికి ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.