
ప్రశ్నించడానికే జనసేన పార్టీని స్థాపించానంటాడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనపై ఆ ప్రాంతం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తమ ప్రశ్నలకు జవాబు చెప్పి రాజధాని ప్రాంతంలో పర్యటించాలన్నారు. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణా రెడ్డి పవన్ కు ఐదు ప్రశ్నలు సంధించారు.
అవేంటంటే..
1. గత ఐదేళ్లు పవన్ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్ ఎందుకు పర్యటించలేదు.?
2. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు.?
3. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థులను నిలబెట్టలేదు.?
4. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి..ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంత వరకు వరకు సమంజసం.?
5. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్..పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైయస్ఆర్సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఈ ఐదు ప్రశ్నలను సంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. పవన్ కల్యాణ్ కు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఉన్న పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని ఘాట్‌గా విమర్శించారు. రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు.