కంబాల వీరుడు శ్రీనివాస్ గౌడ... ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా అందరి నోట వినిపిస్తుంది. ఒక్క రాత్రిలోనే స్టార్ గా మారిపోయాడు శ్రీనివాస్ గౌడ. ఇతని భారత దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.. ఇతని ప్రతిభకు అందరూ ఔరా  అంటున్నారు. ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. గత మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ  యువకుడి పేరే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఈ యువకుని పేరు ఇంతలా మార్మోగి పోవడానికి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడానికి గల కారణం ఏంటో తెలియనిది కాదు. మంగళూరు సమీపంలోని ఖాద్రి లో సాంప్రదాయ కంబాల పోటీలు జరిగాయి. 

 

 

 ఈ పోటీలలో బురదలో పరుగులు పెడుతున్న ఎద్దుల వెంట పరిగెట్టాల్సి  ఉంటుంది. ఈ క్రమంలోనే 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.6 రెండు సెకండ్ల వ్యవధిలోనే పశువులను  పరిగెతత్తిస్తూ  తాను కూడా పరిగెత్తాడు కంబాల వీరుడు శ్రీనివాస్ గౌడ్. అది కూడా మామూలుగా అనుకునేరు కాళ్లు కిందికి దిగిపోయే బురదలో  పరుగులు పెట్టాడు. అంటే సాధారణంగా 100 మీటర్ల పరుగును శ్రీనివాస్ గౌడ్ 9.53 సెకండ్లలో  దాటాడు  అన్నమాట. ఇక ఈ యువకుడు 100 మీటర్ల పరుగును 9.53 సెకండ్లలో  దాటడంతో... వరల్డ్ రన్నింగ్ స్టార్ట్ అయిన హుస్సేన్ బోల్ట్ స్థాపించిన వరల్డ్ రికార్డ్ 9.58 సెకన్లు కంటే తక్కువ ఉండడంతో... ప్రస్తుతం భారతదేశం మొత్తం యువకుని ప్రతిభకు ఔరా అంటుంది. 

 

 

 ఇక ఈ యువకుడి ప్రతిభకు ఎంతో మంది ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రాత్రికి రాత్రే శ్రీనివాస్ గౌడ  స్టార్ గా మారిపోయాడు. కాగా అతని నిపుణులైన సాయి కోచ్ నిపుణులు  పరిశీలిస్తారని అతనిలోని టాలెంట్ను గుర్తించి ఏర్పాట్లను చేశామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కూడా. తనకు వచ్చిన పేరుపై తొలిసారిగా స్పందించారు కంబాల వీరుడు శ్రీనివాస్ గౌడ. ప్రజలు నన్ను ఉసేన్ బోల్ట్ తో పోలుస్తున్నారు. హుస్సేన్ బోల్ట్ వరల్డ్ ఛాంపియన్ నేను కేవలం బురదలో  మాత్రమే పరిగెత్తాను అటు శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చాడు. అయితే శ్రీనివాస్ గౌడ్ ఆ ఎడ్లను తరుముతూ బురదలో పరిగెత్తడమె  కాదు అతని ఫిజిక్ చూసి కూడా ఎంతోమంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: