రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు ఎట్టకేలకు అనుమతి లభించింది. రేపు మధ్యాహ్నం చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి హైదరాబాద్‌తో పాటూ చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నారు. ఏఐసీసీ ఇచ్చిన కార్యాచరణ కావటంతో  ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకున్నారు రాష్ట్ర నేతలు.  

 

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ లో రేపు ఒక్క రోజు నిరసన ధర్నా జరుగనుంది. రేపు 12 గంటల నుంచి 5 గంటల వరకు ధర్నాకు  పోలీసులు అనుమతిచ్చారు. దీంతో ఉదయం 10 గంటల కల్లా...పార్టీ నాయకులంతా.. ఇందిరా పార్క్ కి చేరుకోవాలని పీసీసీ ఆదేశించింది. 12 గంటల నుంచి ధర్నా ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ కుంతియా.. పార్టీ ముఖ్యనాయకులు ఈ ధర్నాలో పాల్గొంటారు  

 

రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఇటీవల చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వాదన మేరకే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందనీ, ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలకు అనుగుణంగానే కేంద్రం వ్యహరిస్తోందని కేంద్రం ఆరోపిస్తోంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఉద్యోగాలు కల్పించటంలోనే కాదు....ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు.

 

ఏఐసీసీ ఇచ్చిన కార్యాచరణ కావడంతో ఈ ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటూ చుట్టుపక్కల జిల్లాల నుంచి శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. సుప్రీం కోర్టు లో కేంద్రం తిరిగి అప్పీల్ చేయటానికంటే ముందే రిజర్వేషన్ల వ్యవహారంపై.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా ఎంత వరకు దారితీస్తుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: