ఆదివారం నాడు వచ్చిన చె(కొ)త్తపలుకును చదివిన వాళ్ళకు ఇదే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏలో చేరాల్సిన అవసరం ఏమిటి ? చేరితే వచ్చా లాభాలు, చేరకపోతే వచ్చే నష్టాలేమిటి ? అనే అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. అంటే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ లెక్క ప్రకారం జగన్ కూడా ఎన్డీఏలో చేరి చంద్రబాబునాయుడు లాగే గబ్బు పట్టాలని బాగా కోరుకుంటున్న విషయం అర్ధమైపోతోంది.
తన మనసులోని కోరికను నేరుగా చెప్పలేక జగన్ ఎన్డీఏలో చేరితే కేసుల నుండి ఉపసమనం వస్తుందని పిచ్చి రాతలు రాశారు. పైగా ఆ విషయాన్ని నేరుగా తాను చెప్పలేక వైసిపిలో ముఖ్యుడొకరు చెప్పారంటూ పిచ్చి రాతలు రాశాడు. జగన్ కు శిక్షపడితే ఆయన రాజకీయజీవితమే కాకుండా మొత్తం పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్ధకమవుతుందని కూడా ఆ ముఖ్యుడెవరో విశ్లేషించాడట. ఎన్డీఏలో చేరితో ఇప్పటికిప్పుడు కలిగే నష్టం కూడా తమకేమీ లేదని ఓ సీనియర్ మంత్రి ఆర్కెకు చెవిలో చెప్పాడట.
కేంద్రంతో డీల్ కుదిరితే జగన్ నిర్దోషిగా బయటపడతాడని అంతకంటే తమకు కావాల్సింది ఇంకేముందని కూడా ఆ సీనియర్ మంత్రెవరో చెప్పాడని ఆర్కె చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే సీనియర్ మంత్రి చెప్పినదాని ప్రకారం కేంద్రంతో డీల్ కుదిరితే చాలు ఎలాంటి కేసుల నుండైనా బయటపడిపోవచ్చు అని అర్కె చెప్పదలిచారా ? అంటే అర్ధమేంటి జగన్ పై ఉన్న కేసులన్నీ తప్పుడు కేసులని ఆర్కె ఒప్పుకుంటున్నట్లే కదా ?
ఇదే సందర్భంలో వైసిపిని ఎన్డీఏలో చేర్చుకుని ఏ 2 గా ఉన్న విజయసాయిరెడ్డికి మంత్రిపదవి ఇస్తే నరేంద్రమోడి ఇమేజి దెబ్బ తింటుందని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి ఇదే ఆందోళన బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు దోచేసుకున్న సుజనా చౌదరికి మంత్రిపదవి ఇచ్చినపుడు ఏమైందో ? అసలు ఎన్డీఏలో చేరాల్సిన అవసరం జగన్ కు ఇప్పటికిప్పుడు ఏమొచ్చింది ? గట్టిగా చెప్పాలంటే మోడికే జగన్ తో అవసరం ఉంటుంది.
ఎందుకంటే ఏప్రిల్ నెల నుండి వైసిపికి రాజ్యసభలో ఆరుగురు ఎంపిలుంటారు. రాజ్యసభలో బిల్లులు పాసవ్వటం మోడికే చాలా అవసరం. వాస్తవం ఇలాగుంటే ఆర్కె మాత్రం రివర్సులో జగన్ ది వన్ సైడ్ లవ్ అన్నట్లు చెత్త రాతలు రాసుకుని తృప్తి పడుతున్నారు.